అనంతపురం, జూలై 6,
హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ గా దీపికా రెడ్డి నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మరో పార్టీ విజయం సాధించలేదు. ఈ సారి అక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్‌సీపీ కొత్త నేతను ఎంపిక చేసుకున్నట్లుగా కనిపస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ ల సమీక్షా సమావేశానికి.. ఎమ్మెల్సీ, ఇంచార్జ్ గా ఉన్న ఇక్బాల్ కు ఆహ్వానం ఇవ్వలేదు. దీపికా రెడ్డినేపిలిచారు. తాజాగా ఆమెకు ఇంచార్జ్ పదవిని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో హై ప్రోఫైల్ నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత మరో పార్టీ అక్కడ గెలవలేదు . అందుకే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తూంటారు. ప్రస్తుతం బాలకృష్ణ అక్కడ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. బాలకృష్ణను ఢీ కొట్టాలంటే ఎలాంటి ఇమేజ్ లేని నేత అవసరం అని ... ఐ ప్యాక్ డిసైడ్ చేయడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీపికా రెడ్డిని ఎంపిక చేశారని అంటున్నారు. పెద్దిరెడ్డిగా అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి ద్వారా ఎమ్మెల్సీకి చెక్‌పెట్టి, దీపికను తెరపైకి తీసుకొచ్చారని చెబుతున్నారు. హిందూపురం వైసీపీలో చాలా గ్రూపులున్నాయి. కాంగ్రెస్ తరపున.. తర్వాత వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చల్ మరోసారి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఆగ్రోస్ చైర్మన్ పదవి ఉంది. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోనే ఉన్నారు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో గత ఎన్నికల్లో హిందూపురం నుంచి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ పోటీ చేశారు. ఆయన కర్నూలు జిల్లాకు చెందిన వారు. అక్కడ ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దాంతో ఆయనే హిందూపురంలో పెత్తనం చేస్తున్నారు. అయితే ఆయనను బలంగా వ్యతిరేకించే వర్గం అక్కడ ఉంది. ఓ వర్గానికి చెందిన చౌళూరు రామకృష్ణారెడ్డి అనే నేత హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ఇక్బాల్ పేరే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే చర్యలు తీసుకోలేదు కానీ..ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.నియోజకవర్గంలో పెద్దగా ఎవరికీ తెలియని దీపికారెడ్డిని ఇంచార్జ్ గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో హిందూపురం టికెట్.. ఆమెకి కేటాయించడం దాదాపు ఖాయమైనట్లే. రాజకీయాల్లో అసలు ఎవరికీ తెలియని నేతను తీసుకొచ్చి.. నిలబటెట్డం అంటే సాహసం అనుకోవాలి. అదీ కూడా బాలకృష్ణ లాంటి మాస్ లీడర్ పై కొత్త నేతను దింపితే.. అందరి సహకారంతో పని చేస్తేనే పోటీ ఇవవగలుగుతారు. ఇప్పుడు టిక్కెట్ ఆశిస్తున్న నేతలంతా పని చేయడం మానేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.