YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాం : టిటిడిపి ప్రెసిడెంట్ యల్ రమణ

స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాం : టిటిడిపి ప్రెసిడెంట్ యల్ రమణ

టీడీపీ రెండో మహానాడు ఘనంగా నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో టిడిపి బలంగా ఉంది.  గత ఎన్నికల్లో ఎన్డీఏ మిత్ర పక్షంతో 20 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాలను ప్రజలు మాకు ఇచ్చారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. శుక్రవారం నాడు అయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  బీజేపీ మిత్రధర్మానికి పాటించకుండా టిడిపితో తెగధింపులు చేసుకుంది. ప్రభుత్వం పై ఆధారపడి బతుకుతున్న ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని అన్నారు.  ప్రస్తుతం కెసిఆర్‌ పాలనలో అణగారిన వర్గాల అభ్యున్నతి మృగ్యమైందని ఆయన అన్నారు. 2019లో టిడిపి భాగస్వామ్య ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. పార్టీ జెండా కిందా ఎదిగి మా పై ఆరోపణలు చేసిన...పార్టీని విడినా మేము భాదపడలేదని అన్నారు. గతంలో చంద్రబాబు తయారుచేసిన డాక్యుమెంట్ ఇవ్వాళ ఏపీ, తెలంగాణకు దిశానిర్దేశం చేస్తుంది.  వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాం. పార్టీకి లోపడి ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్తున్నామని అన్నారు. పార్టీ నియమనిబంధనలకు లోబడి పనిచేసే ప్రతి ఒక్కరినీ పార్టీ గౌరవం ఇస్తుందని అన్నారు.  తెలంగాణ వస్తే ఇక్కడి అణగారిన వర్గాలకు, పేదలకు ఎంతో మేలు జరుగుతుందని, అన్ని రంగాల్లో అవకాశాలు వస్తాయని భావించామన్నారు. ఆ వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తారని అనుకున్నామని ఆయన చెప్పారు. అయితే వీటన్నింటినీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పట్టించుకోకుండా, తన ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు.

టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహనడును సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని అన్నారు. 2019 ఎన్నికల్లో మా పొత్తులేకుండా ఏ పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యదు. మొన్న టీఆరెస్ ఫ్లీనరీలో ఆహారం గురించి తప్పా పెద్దగా చర్చ జరగలేదు. ఇదే ఉత్సహంతో ముందుకు వెళ్తామని అన్నారు.

పార్టీ నేత ఆమర్నాథ్ బాబు మాట్లాడుతూ శనివారం  నుంచి నిజామాబాద్ లో సకల జన పాదయాత్ర  వుంటుందని అన్నారు. జూన్ 11న ముగింపు సభ  వుంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లో జరిగిన అవకతవకల పై యాత్ర చేస్తామన్నారు. మైనార్టీ రిజర్వేషన్లు, విద్యా, వైద్యం, ఉద్యోగాల పై ప్రభుత్వం చేసిన పనుల్లో ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు.

Related Posts