YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జేడీయూలో తప్పని చీలక..?

జేడీయూలో తప్పని చీలక..?

పాట్నా, జూలై 6, 
బిహార్ లో అధికారంలో ఉన్న జనతా దళ్ యునైటెడ్ పార్టీ (జేడీయూ) కూడా చీలిక దిశగా వెళ్తోందా?.. పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ పై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందా?.. శివసేన, ఎన్సీపీల తరువాత బీజేపీ తదుపరి లక్ష్యం జేడీయూ యేనా?బిహార్ లో అధికారంలో ఉన్న జనతా దళ్ యునైటెడ్ పార్టీ (జేడీయూ) కూడా చీలిక దిశగా వెళ్తోందా?.. పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ పై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందా?.. శివసేన, ఎన్సీపీల తరువాత బీజేపీ తదుపరి లక్ష్యం జేడీయూ యేనా?బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో.. మరోవైపు, ఆ విపక్షాల్లోని కీలక పార్టీల వెన్ను విరిచే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ కీలక నేత అజిత పవార్.. పార్టీని చీల్చి, బీజేపీ నాయకత్వానికి జై కొట్టారు. బీజేపీ, శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, బిహార్ లో కూడా జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ పై పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందని, త్వరలో జేడీయూలో కూడా చీలిక తప్పదని బీజేపీ చెబుతోంది. ముఖ్యంగా తన వారసుడిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను నితీశ ప్రకటించడం, జాతీయ స్థాయి విపక్ష కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి ఆమోదం తెలపడం వంటి చర్యలు.. నితీశ్ పై పార్టీలో వ్యతిరేకత పెరగడానికి కారణమని భావిస్తున్నాయి.జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది తమను సంప్రదిస్తున్నారని బీజేపీ నేత, మాజీ డెప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ వెల్లడించారు. పొత్తుల కారణంగా, వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ లభించే అవకాశం లేదని, ఒక వేళ టికెట్ లభించినా నితీశ్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా కచ్చితంగా ఓడిపోతామని వారు భావిస్తున్నారని సుశీల్ మోదీ తెలిపారు. ఆర్జేడీతో పొత్తు వల్ల జేడీయూ నష్టపోతోందని వారు భావిస్తున్నారని వెల్లడించారు. జేడీయూకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు,ఎంపీల్లో నితీశ్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఎలాంటి షరతులు లేకుండా వారు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ‘జేడీయూలో తిరుగుబాటు నెలకొనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జేడీయూకి భవిష్యత్తు లేదనుకుంటున్నారు. నితీశ్ కుమార్ తన వారసుడిగా తేజస్వీని ప్రకటించడం పార్టీకి చేటు చేస్తుందని భావిస్తున్నారు. అందువల్ల, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీలో చేరడానికి పోటీ పడుతున్నారు’’ అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు.జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది తమను సంప్రదించారని సుశీల్ మోదీ తెలిపారు. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి? ఎవరిని తీసుకోకూడదు? అనే విషయంలో బీజేపీ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదన్నారు. మొత్తానికి జేడీయూలో మాత్రం పరిస్థితి చాలా అస్థిరంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘పైగా, పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీఎం నితీశ్ ఏ మాత్రం సమయం ఇవ్వడం లేదు. వారిని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తుపై వారికి భరోసా ఇవ్వడం లేదు. ఆ అసంతృప్తి కూడా వారిలో ఉంది’’ అని సుశీల్ మోదీ వివరించారు.నితీశ్ కుమార్ పార్టీ అయిన జేడీయూతో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోదని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. దాదాపు 17 ఏళ్ల పాటు నితీశ్ కుమార్ ను మోశామని, ఇకపై ఆ తప్పు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేత అమిత్ షానే స్వయంగా చెప్పారన్నారు. ‘‘చివరకి నితీశ్ స్వయంగా వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నా.. ఆయనతో కలిసే ప్రసక్తే లేదు. అని అమిత షా అన్నారు’’ అని సుశీల్ వెల్లడించారు.

Related Posts