YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూలై 14 చంద్రయాన్...

జూలై 14 చంద్రయాన్...

నెల్లూరు,జూలై 7, 
చంద్రుడిపై పరిశోధనలు లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి తేదీ, సమయాన్ని ఇస్రో ప్రకటించింది. జూలై 14న మధ్యాహ్నం 2.35 నిమిషాలకి ప్రయోగం చేపడతామని ఇస్రో ట్వీట్ చేసింది.ఇటీవలే ఈ ప్రయోగంలో భాగంగా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎంకే III (జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్ III) తో అనుసంధానించారు. చంద్రుడిపైకి భారత్ ఉపగ్రహాన్ని పంపుతున్న మూడో ప్రయోగం ఇది. చంద్రయాన్-2 కు కొనసాగింపుగా దీన్ని ఇస్రో చేపడుతోంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. జులై 13వ తేదీన చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని సిద్ధం చేస్తోంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ ను చేపట్టనున్నారు.

Related Posts