YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిగ్రీ క్లాసులపై ఇంకా మీమాంస

డిగ్రీ క్లాసులపై ఇంకా మీమాంస

విజయవాడ, జూలై 7, 
ఏపీలో డిగ్రీ కాలేజీ అడ్మిషన్ కౌన్సిలింగ్ మళ్లీ వాయిదా పడింది. ఫీజులు ఖరారు కాకపోవడం, దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కౌన్సిలింగ్ తేదీలను రెండోసారి వాయిదా వేశారు.ఏపీలో డిగ్రీ కాలేజీ కోర్సుల్లో అడ్మిషన్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడింది. ఫీజులు ఖరారు కాకపోవడంతో పాటు ఖాళీలకు తగ్గట్టుగా దరఖాస్తులు రాకపోవడంతో కౌన్సిలింగ్ తేదీలను మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో 3.5లక్షల సీట్లు అందుబాటులో ఉంటే వాటిలో ప్రవేశాల కోసం 1.25 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కౌన్సెలింగ్ గడువును ఉన్నత విద్యామండలి మరోసారి వాయిదా వేసింది. మొదటి షెడ్యూ ల్‌ గడువు పొడిగించిన ఉన్నత విద్యా మండలి మళ్లీ దానిని పొడిగించింది. తొలి షెడ్యూల్ ప్రకారం జూన్ 26 నుంచి విద్యార్ధులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉందిపలు కారణాలతో ఉన్నత విద్యామండలి గతంలో ఒకసారి దీనిని పొడిగిం చింది. పొడిగించిన గడువు జులై 6వ తేదీ గురువారంతో ముగుస్తుంది. మళ్లీ దీనిని 12వ తేదీ వరకు పెంచారు. 12 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చని, 15 నుంచి 19 తేదీల మధ్య వెబ్ ఆప్షన్లు ఇవ్వా లని పేర్కొంది. 24న సీట్ల కేటాయింపు జరుగుతుందని, అదే రోజు తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. పరి పాలనా కారణాలతో గడువు పొడిగించినట్లు తెలిపింది.డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దర ఖాస్తుల సంఖ్య భారీగా పడిపోవడం ఒకటైతే, ఇప్పటికీ కోర్సులు ఫీజులు నిర్ణయించకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. డిగ్రీ ఫీజులపై ఉన్నత విద్యా కమిషన్ నెల కిందటే ప్రతిపాదనలు పంపినా , దానిపై ప్రభుత్వం ఇప్పటి ఉత్తర్వులు జారీ చేయలేదు.విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే సమయానికి ఏ కాలేజీలో, ఏ కోర్సుకు ఎంత ఫీజు అనేది చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కాలేజీ ఫీజులను తేల్చకపోవడంతో కౌన్సెలింగ్ వాయిదా పడుతోంది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు రాలేదు. 3.5 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే లక్షా 25వేల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొదటి షెడ్యూలు నాటికి కేవలం 80 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువును పొడిగించడంతో మరో 45వేల మంది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ గడువు పొడిగిం చడంతో ఇంకా కొత్త దరఖాస్తులు వస్తాయని ఉన్నత విద్యామండలి ఎదురుచూస్తోంది.ఈ ఏడాది ఇంజనీరింగ్ కంటే ముందే డిగ్రీ షెడ్యూలు ఇవ్వడంతో ఇంజనీరింగ్‌ కోర్సులకు వెళ్లే ఆలోచన ఉన్నవారు కూడా డిగ్రీకి దరఖాస్తు చేసుకు న్నారు. ఇంజనీరింగ్ లో మంచి సీటు రాకపోతేనే వారు డిగ్రీలో చేరతారు. సింగిల్ మేజర్ విధానంపై కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యామండలి అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించడం కూడా దరఖాస్తులు పడిపోవడానికి కారణమని చెబుతున్నారు.ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ రామ్మోహనరావుకు కృష్ణా వర్సిటీ వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో రెండు పదవుల్లో పనిచేయాల్సి వస్తోంది. రెండురోజులు మండలిలో, రెండు రోజులు యూనివర్సిటీలో ఉంటున్నారు. రెండు పదవుల్లో కొనసాగడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.

Related Posts