విశాఖపట్టణం, జూలై 8,
విశాఖపట్నంలో వ్యక్తుల్ని భయపెట్టి డబ్బుల్ని దోచుకున్న ముఠాకు సీఐ స్వర్ణలత నేతృత్వం వహించినట్లుగా స్పష్టం కావడం పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆమెకు ఉన్న రాజకీయ సంబంధాలు, పోలీసు అధికారుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా ఉంటూ చేసిన ఘన కార్యాలపై పోలీసు శాఖలోనే అనేక ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాజకీయ నేతల ఆశీస్సులు, ప్రభుత్వ మెప్పు కోసం ఆమె .. రాజకీయ ప్రకటనలు కూడా చేసిన సందర్భాలు ఉండటంతో ... సీఐ స్వర్ణలత గత నిర్వాకాలపై సోషల్ మీడియాపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
పోలీసులకు.. రాజకీయాలకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏం జరిగినా పోలీసులు జోక్యం చేసుకోకూడదు. కానీ నేరుగా కమిషనర్ ఆఫీసులోనే .. పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు హోదాలో ప్రెస్ మీట్ పెట్టిన స్వర్ణలత.. మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సంఘం పేరుతో స్పందించవచ్చు కానీ.. కమిషనర్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుల్ని .. విమర్శించడం.. సవాళ్లు చేయడం వివాదాస్పదమయింది. అయితే ఆమె ఇలా స్పందించడానికి కారణం .. ఆమెకు అండగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నేతల సూచనలేనని చెబుతారు. విశాఖ కమిషనర్ కార్యాయయంలోనే సీఐ స్వర్ణలత చాలా కాలం పని చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచే పోలీసు పాలన జరుగుతుంది కాబట్టి..ఆమె తన పోస్టును అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని పోలీసు స్టేషన్ల విషయాల్లోనూ జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలతో స్వర్ణలత మంచి సంబంధాలు కొనసాగించి.. సర్వీస్ పరంగా ఇబ్బందులు రాకుండా.. పోస్టింగ్‌ల లాబీయింగ్ కూడా చేస్తారని అంటున్నారు. ఆమె ఇలా బెదిరించి డబ్బులు దోపీడీ చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత .. విశాఖలో ఓ కీలక ప్రజాప్రతినిధి ఆమెపై కేసు పెట్టకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. జిల్లా స్థాయిలో సాధ్యం కాకపోవడంతో.. రాష్ట్ర స్థాయి కీలక నేతతోనూ ఫోన్ చేయించారంటున్నారు. కానీ విషయం బయటకు రావడంతో స్వర్ణలతపై కేసు పెట్టక తప్పలేదు. సాధారణంగా పోలీసులు ఇలాంటి పనులు చేస్తే.. డిపార్టుమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. వెంటనే.. ఆమె ఇంతకు ముందు ఇలా ఎమైనా చేసిందేమో దర్యాప్తు చేస్తారు. కుుంబసభ్యులు, బంధువులు ఏమైనా అక్రమాస్తులు సంపాదించారేమో చూస్తారు. ఏసీబీ మొత్తం.. ఆ పోలీసు అధికారి వ్యవహారాలన్నింటనీ బయటకు తీస్తుంది. అయితే ఇక్కడ సీఐ స్వర్ణలతపై తప్పని సరి పరిస్థితుల్లో..అదీ కూడా బయట కు తెలిసిందన్న కారణంగా కేసు పెట్టారని.. అందుకే ఆమె ను ఏ 4గా పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అంత సీరియస్ చర్యలేమీ ఉండవన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తవుతున్నాయి. కంచే చేను మేస్తే.. ఇక ప్రజలకు ఎవరికి చెప్పుకుంటారు ? ఇలాంటి అధికారుల్ని కఠినంగా శిక్షిస్తేనే.. వ్యవస్థపై ప్రజలకు భరోసా ఉంటుందని లేకపోతే నమ్మకం కోల్పోతారన్న అభిప్రాయాలు సామాన్యుల నుంచి వస్తున్నాయి.
కరెన్సీ ముఠా కేసులో నాన్ బెయిల్ బుల్ కేసు
తాజాగా 90 లక్షల రూపాయల విలువ చేసే 500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ చేసే 2000 నోట్లు ఇస్తామంటూ రప్పించుకొని.. బాధితులపై బెదిరింపులకు పాల్పడ్డారు హోంగార్డ్స్ ఆర్ఐ స్వర్ణలత. ఈ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. 2000 రూపాయల కరెన్సీ ముఠా కేసులో నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేశారు. ద్వారకా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 61/2023 గా కేసు నమోదు కాగా.. స్వర్ణలత సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు రిటైర్డ్ నేవీ ఆఫీసర్ల నుంచి డబ్బులు కొట్టేయడంలో స్వర్ణలతకు కానిస్టేబుల్, హోంగార్డ్ సహకరించి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. స్వర్ణలతోపాటు మిగతా ముగ్గురు నిందితులపై 386, 341, 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 12 లక్షల్లో స్వర్ణ లత 5 లక్షలు నొక్కేశారని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆమె సిబ్బంది మరో రెండు లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది.ఈ నగదు మార్పిడి వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న సూరిబాబు బాధితులను బెదిరించి 5 లక్షలు లాగేశారు. ఇలా వసూలు చేసిన 12 లక్షల రూపాయల బ్యాగుతో సూరిబాబు పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే బాధితులైన నేవీ రిటైర్డ్ ఆఫీసర్లు శ్రీధర్, హేమ సుందర్ లు అతడిని అడ్డుకున్నారు.అక్కడే కథ మరో మలుపు తిరిగింది. తనను శ్రీధర్, హేమసుందర్ అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన సూరిబాబు.. అనుచరులను పిలిపించాడు. తనపై దాడికి పాల్పడుతున్నారంటూ ముగ్గురు వ్యక్తులకు ఫోన్ చేసి పిలిచాడు. దీంతో అక్కడకు చేరుకున్న స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించారు. ఈక్రమంలోనే ఎంవీపీ పోలీసులు కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. స్వర్ణలత వద్ద కోటి రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు వరకూ ఉన్నాయి. ఇటీవలే రెండు వేల రూపాయలను తిరిగి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో వాటిని ఎలాగైన మార్చుకోవాలనుకున్నారు. నేరుగా బ్యాంకుకు వెళ్లలేదు. తెలిసిన వాళ్ల ద్వారా తన వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను ఎవరికైనా అంటగట్టాలనుకున్నారు. ఈ క్రమంలోనే సదరు అధికారికి ఓ నేవీ రిటైర్డ్ అధికారులు తగిలారు. వారి వద్ద కోటి రూపాయల వరకు నగదు ఉందని గ్రహించిన ఆ అధికారి వారికి టోకరా వేశారని టాక్.90 లక్షల రూపాయల 500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయలు ఇస్తానన్న మాట వాళ్లతో చెప్పారు స్వర్ణలత గ్యాంగ్. వాళ్లు కూడా ఓకే అన్నట్టు సమాచారం. రెండు గ్రూప్‌ల మధ్య డీల్ కుదిరిన తర్వాత నోట్ల మార్పిడీ జరిగింది. అయితే ఇక్కడే అధికారి తన తెలివితేటలు ఉపయోగించారు. పోలీసు అధికారి మాటలు నమ్మిన రిటైర్డ్ నేవీ ఆఫీసర్లు శ్రీధర్, హేమ సుందర్ లు 90 లక్షల విలువ చేసే 500 రూపాయల నోట్లు పట్టుకొని వచ్చారు. ఈ క్రమంలోనే వీరి వద్ద నుంచి స్వర్ణలతు అండ్ గ్యాంగ్ 12 లక్షల రూపాయలు కొట్టేసింది.