YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంగన్వాడీలో 19 రకాల వస్తువులతో కిట్లు

అంగన్వాడీలో 19 రకాల వస్తువులతో కిట్లు

గుంటూరు, జూలై 8, 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం అద్భుతమైన కిట్లను అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆడుతూ పాడుతూ చదువుకునే చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే విధంగా ఉండే వస్తువులను ఈ కిట్టులో చేర్చింది. ఒక పలక, రెండు పెన్సిళ్లు, 12 స్కచ్ పెన్సిళ్లు, ఓ రబ్బర్, షార్ప్ నర్ తో కూడిన కిట్టును ప్రతీ విద్యార్థికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ నెలాఖరులోగా వీటిని చిన్నారులను అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 3 నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించి... వారి చుదవుకు బలమైన పునాదులు వేసేలా ఈ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 8.50 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీని చేపట్టబోతుంది. ఇటీవలే 19 రకాల ఆట వస్తులతో ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో కిట్టును అందజేసింది. ఆ కిట్ లో చిన్నారులకు ఉపయోగపడే మ్యాట్, సాఫ్ట్ బాల్, చెక్కతో చేసిన సంఖ్యల పజిల్, పెగ్ బోర్డు, అబాకస్, చెక్క బూట్లు, బిల్డింగ్ బ్లాక్ లు, గమ్ స్టిక్స్, 25 ముక్కల రంగుల పేపర్లు, 5 సెట్ల వాటర్ కలర్స్, 5 సెట్ల స్కెచ్ పెన్నులు, 5 ప్యాకెట్ల పెన్సిళ్లు, 5 రబ్బర్లు, 5 షార్ప్ నర్లు. నమూనాల ట్రేసింగ్ బోర్డు, డాఫ్లి, బ్లోయింగ్ సంగీత వాయిద్యాలు, 20 పలకలు బొమ్మలు తయారు చేసేలా 5 సెట్ల మౌల్డింగ్ క్లే, మూడు ప్యాకెట్ల డస్ట్ ఫ్రీ సుద్ధలు, బంతితో బాస్కెట్ బాల్ హోప్, 20 కథల పుస్తకాలు అందించారు. ఇదే కాకుండా అంగన్‌వాడీలకు అందించే ఆహారంలో మునగాకును ప్రభుత్వం చేర్చింది. ఇప్పటి వరకు పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన మెను విజయవంతం అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. పోషల విలువలు ఎక్కువ ఉండే మునగాకు వారానికి రెండు రోజులు అందివ్వనున్నారు. దీని వల్ల గర్భిణులు బాలింతలు, చిన్నారల ఆరోగ్య సమస్యలకు చెక్‌ చెప్పవచ్చని ఆలోచన. మునగాకు చేసే మేలు మరే ఇతర ఆకు కూరలు చేయవని చాలా మంది నమ్ముతున్నారు. రోజువారి ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోమని వైద్యులు కూడా చెబుతున్నారు. పసిబిడ్డలకు పాలిచ్చే తల్లులు మునగాకును తీసుకుంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. దీన్ని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు.మునగాకులో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉంటే ఫ్లేవానాయిడ్లు కారణంగా రక్తపోటును తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి.. గుండె పని తీరు మెరుగు పరచడంలో ఇది బాగా పని చేస్తుంది. అందుకే దీన్ని అంగన్‌వాడీ మెనూలో చేర్చాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఓ గ్రామంలో మునగ చెట్లను పెంచి ఆ చెట్టు నుంచి వచ్చే ఆకులను గర్భిణులకు, బాలింతలకు అందజేసింది. మునగాకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో రూపంలో లబ్దిదారులకు అందజేసింది. వారానికి రెండు రోజులు దీన్ని ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయించారు.

Related Posts