YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్‌ని భయపెడుతున్న ఎల్‌నినో,

భారత్‌ని భయపెడుతున్న ఎల్‌నినో,

ముంబై, జూలై 8, 
పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో  ఎఫెక్ట్‌ మొదలైనట్టు ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఏడేళ్ల తరవాత ఈ స్థాయిలో ప్రభావం కనిపించడం ఇదే తొలిసారి. ఈ ఎఫెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు అధికమయ్యే ప్రమాదముంది. ఈ ఏడాదిలో వచ్చే ఆర్నెల్ల పాటు ఈ ఇంపాక్ట్ కొనసాగుతుందని WMO స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్‌తో అంతర్జాతీయంగా ఉన్న వాతావరణ నిపుణులు అలెర్ట్ అయ్యారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. WMO ఇచ్చిన హెచ్చరికల ఆధారంగా అన్ని దేశాలూ అప్రమత్తం అవ్వాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రభావం చూపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సాధారణంగా ప్రతి 2-7 ఏళ్లకు ఎల్‌నినో ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 9-12 నెలల పాటు ఆ ప్రభావం కొనసాగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఇదంతా సహజమే అయినా...ఈ సారి ఈ ప్రభావం మరీ తీవ్రంగా ఉండనుంది. వచ్చే ఐదేళ్లలో చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని WMO అంచనా వేసింది. 2016లో ఎల్‌ నినో చూపించిన ప్రభావం కన్నా ఇది ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కన్నా కనీసం 1.5 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఆ తరవాత కూడా ఇవే టెంపరేచర్స్‌ కొనసాగుతుండొచ్చని WMO సైంటిస్ట్‌లు చెబుతున్నారు. WMO లెక్కల ప్రకారం...2016లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సౌత్ అమెరికా, సౌతర్న్ యూఎస్, మధ్య ఆసియా ప్రాంతాల్లో ఎన్‌ నినో ప్రభావం కనిపించనుంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియాతో పాటు దక్షిణాసియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కరవు సంభవించే ప్రమాదముంది. ఇండియాపై కూడా దీని ఇంపాక్ట్‌ గట్టిగానే ఉండేలా ఉంది. ఇప్పటికే నైరుతి రుతు పవనాలు ఆలస్యం కాగా...ఎల్‌నినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కరవు సంభవించే దేశాల లిస్ట్‌లో భారత్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ఓ కారణముంది. ఎల్‌నినో ప్రభావం వల్ల సముద్రాలు వేడెక్కుతాయి. ఫలితంగా...నైరుతి రుతు పవనాల కదలిక కాస్త తగ్గిపోతుంది. అది నేరుగా వర్షపాతంపై ప్రభావం చూపిస్తుంది. వర్షాలు సరిగ్గా కురవక పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఇటీవల భారీ వర్షాలు కురిసి కూరగాయల సాగు తీవ్రంగా దెబ్బతింది. ధరలు ఆకాశాన్నంటాయి. ఇక రానున్న రోజుల్లో కరవు వచ్చినా...ఇదే పరిస్థితి తలెత్తుతుంది. మరి కొన్ని రోజుల పాటు కూరగాయల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2001-20 మధ్య కాలంలో దాదాపు నాలుగు సార్లు ఎల్‌నినో కారణంగా కరవు సంభవించింది. ఆయా సంవత్సరాల్లో పంట దిగుబడి తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగింది. మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తే ప్రమాదముందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలూ సిద్ధంగా ఉండాలని సూచించింది.

Related Posts