YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వ్యభిచార కూపాలుగా స్పాసెంటర్లు

వ్యభిచార కూపాలుగా స్పాసెంటర్లు

హైదరాబాద్, జూలై 8, 
ప్రగతి పథంలో విశ్వనగరం.. మినీ ఇండియాగా హైదరాబాద్‌ అభివృద్ధి పరుగులు.. ఇదంతా ఒకవైపు.. రెండోవైపు చూస్తే ఐకానిక్‌ సిటీపై మత్తు మరక.. పబ్బులు.. క్లబుల మాటున గబ్బు సిత్రాల్‌. స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం. డే అండ్‌ నైట్‌ ఖాకీల నిఘా.. అమల్లో కఠిన నిబంధనలు అయినా సరే పబ్‌ల్లో ఆగడాకు కళ్లెం ఎక్కడ? అవును, స్పాసెంటర్లు వ్యభిచార కూపాలుగా మారుతున్నాయి. కొందరు డబ్బుమీద అత్యాశతో చేస్తున్న పాడు పనులు మిగిలిన వారిని బద్నాం చేస్తున్నాయి. విశ్వనగరంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌పై ఇదో బ్లూ స్పాట్‌గా తయారైంది.తాజాగా ఈ వివాదాస్పద ఫ్రేమ్‌లో బంజారాహిల్స్‌ జన్నత్ సెలూన్ అండ్ స్పా. మరోటి మహీ ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా సెలూన్. మసాజ్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న గలీజ్ సెంటర్లు ఇవి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని జన్నత్ సెలూన్ అండ్ స్పా మీద అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసుల దాడులు చేశారు. ఈ దాడుల్లో సెక్స్ వర్కర్లతో చేయిస్తున్న చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. లోకలే కాదు నాన్ లోకల్ ఫ్లేవర్ కూడా ఉంది ఇక్కడ. ఎక్కడి నుంచో యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నడుస్తోంది అక్కడ. సెక్స్ వర్కర్లతో పాటు.. స్పా నిర్వాహకుడు రత్లావత్ విజయ బాబు, విటుడు కైలావత్ రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇక సెకండ్ స్పాట్.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10. ఇక్కడ స్పా సెంటర్ పేరు మహీ ఆయుర్వేదిక్ బ్యూటీ సెలూన్. ఇక్కడ పేరులోనే ఆయుర్వేదిక్.. కానీ లోపల అంతా థాయ్ మసా టైప్. చూడ్డానికి సంస్కారవంతమైన బోర్డు. కానీ లోన జరిగేదంతా ట్రిపుల్‌ ఎక్స్‌ మజా మస్తీ. ఆయుర్వేద థెరపీ ముసుగులో పచ్చి బూతు దందా నడుపుతున్నారు నిర్వాహకులు. వచ్చిన కస్టమర్లకు రేటును బట్టి సర్వీస్ ఇస్తున్నారు. మసాజ్ పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారిక్కడ.అయితే, గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్స్ చేశారు. ఇద్దరు సెక్స్ వర్కర్లను రెస్య్యూ హోమ్‌కు తరలించారు. నిర్వాహకురాలు ఫర్జానా బేగం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. మరో నిందితుడు సునీల్ కుమార్ పరారీలో ఉన్నాడు. రెండు చోట్లా ఇదే సీన్ వెలుగు చూడటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ బ్రోతల్‌ బ్యాక్‌ఎండ్‌లో ఎవరున్నారు? కస్టమర్ల జాబితా ఏంటీ? ఎన్నాళ్ల నుంచి జరుగుతుందీ వ్యవహారం అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

Related Posts