YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రారంభమైన ఎన్నికల హడావిడి

ప్రారంభమైన ఎన్నికల హడావిడి

హైదరాబాద్, జూలై 8, 
తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలయింది. ఇదివరకే ఢిల్లీ నుండి ఎన్నికల కమిషన్‌‌కు చెందిన ఉన్నత అధికారులు పలు దఫాలుగా రాష్టంలోని ఉన్నతాధికారులతో ఎన్నికల ఏర్పాటుకు సంబంధించి సమీక్షలు నిర్వహించారు. ఇక ఎలక్షన్ కమిషన్ రాష్టంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ ఇస్తే.. అప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లాల్లోని అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల అధికారులు ఎన్నికల ఏర్పాటుకు సంబంధించిన పనులపై దృష్టి సారించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఒకొక్కటిగా పూర్తిచేస్తున్నారు. దీంతో జిల్లాల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. సెప్టెంబర్లేదా అక్టోబర్ మధ్యలో ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో అధికారులు కొత్త ఓటర్ల నమోదు, ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు, ఈవీఎంలు, పోలింగ్స్టేషన్ల తనిఖీలను ఇదివరకే ముమ్మరం చేశారు.బీఎల్‌వోల నియామకంతో పాటు శాఖలవారీగా ఆఫీసర్లు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ దాదాపు పూర్తికావచ్చింది. అటు బూత్‌ల వారీగా వసతులు ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలైంది. మరోవైపు కొత్త ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ నెల చివరికల్లా ఏర్పాట్లు పూర్తిచేసి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది.ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటర్ లిస్టులో మార్పు చేర్పుల కోసం చేపట్టిన హౌస్టూ హౌస్సర్వే జూన్23కే పూర్తయింది. బూత్లెవల్ ఆఫీసర్లుగా నియమించిన అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాత ఓటర్ లిస్టుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ‘ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నారు? ఓటరు లిస్టులో ఉన్న వ్యక్తులు బతికే ఉన్నారా? ఇక్కడే నివాసం ఉంటున్నారా? చనిపోయారా? వీరి పేర్లను లిస్టులో నుంచి తీసేయాల్సిన అవసరం ఉందా? పేర్లు, అడ్రస్‌లో మార్పులు చేయాల్సి ఉందా? ఇళ్లల్లో 18 ఏండ్లు నిండిన యువత ఉన్నారా? వారికి ఓటు హక్కు కల్పించాలా?’ అనే వివరాలను సేకరించి ఆ వివరాలను ఆన్ లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిన యువతుల వివరాలను ఆయా ఊళ్లకు బదిలీ చేస్తున్నారు. ఒకే పేరు మీద ఎంట్రీ అయిన డబుల్ఓట్లను సరిచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ 70 శాతం పూర్తి కాగా, ఈ నెలాఖరు నాటికి వంద శాతం కంప్లీట్ చేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ సర్వే ద్వారా 10.5 లక్షల డూప్లీకేట్ ఓట్లను తొలగించినట్లు సమాచారం.తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర జిల్లా స్థాయి ఆఫీసర్లు వారంలో రెండు రోజులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. వీరితో పాటు బీఎల్‌వోలతో స్టేషన్ల విజిట్చేయిస్తున్నారు. అక్కడ ఎలాంటి వసతులు అవసరం ఉన్నాయి? కరెంటు ఉందా? లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయా? మంచినీళ్లు అందుబాటులో ఉన్నాయా? టాయిలెట్స్ ఉన్నాయా? ఫర్నీచర్ ఉందా? ర్యాంప్ ఉందా? అనే వివరాలను ఫీల్డ్‌కు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇంకా ఎలాంటి వసతులు కల్పించాలనేది నోట్ చేసుకుంటున్నారు. క్రిటికల్, హైపర్ క్రిటికల్, సెన్సిటివ్ ప్రాంతాలను మండల స్థాయి ఆఫీసర్లు విజిట్ చేసి పరిశీలిస్తున్నారు. సెన్సిటివ్ ఏరియాల్లో పోలింగ్స్టేషన్ల లొకేషన్ మార్చాలా? రద్దీ అధికంగా ఉంటే స్టేషన్ ప్రాంతంలో అదనంగా మరో స్టేషన్ అవసరం అవుతుందా? అనే వివరాలను క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు రికార్డు చేస్తున్నారు.కొత్త ఓటరుగా ఎన్రోల్ చేసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో కొందరు వలంటీర్లు, బీఎల్వోలు సైతం 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించి, వారితో కొత్త ఓటరుగా నమోదు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ జోరుగా సాగుతుండగానే మరోవైపు కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన అప్లికేషన్లు, మార్పులు, చేర్పులు, డిలిషన్ వివరాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్‌ను పబ్లిష్ చేయనుంది. ఈ లిస్టును అన్ని గ్రామాలవారీగా పంచాయతీ ఆఫీసుల వద్ద అతికించనున్నారు. వీటి ఆధారంగా మళ్లీ అబ్జెక్షన్లు, మిస్సింగ్నేమ్స్తదితర వివరాలను సేకరించనున్నారు. పొలిటికల్ పార్టీలకు ఈ లిస్ట్‌ను అందజేసి, శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నారు. అనంతనం సెప్టెంబరులో తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలక్షన్కమిషన్డెమాన్స్ర్టేషన్, స్టాస్టిక్ ఈవీఎంలను అందుబాటులోకి తేనుంది. ఇందులో ఒక సెట్ తహసీల్దార్ ఆఫీసులో, మరొక సెట్ మొబైల్ ఈవీఎం ద్వారా గ్రామాల్లో ప్రదర్శించనున్నారు. మొబైల్టీం వెంట సెక్టోరియల్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 10 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 30 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా టార్గెట్పెట్టుకున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఆఫీసర్లు రూట్ మ్యాప్ లకు సంబంధించిన షెడ్యూల్స్ తయారు చేస్తున్నారు.ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ స్థాయి ఆఫీసర్లు నిత్యం తనిఖీ చేస్తున్నారు. ఈవీఎంల భద్రత ఎలా ఉంది? అనే దానిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్తెప్పించుకుంటున్నారు. అలాగే ఎన్నికల రిటర్నింగ్ఆఫీసర్లు నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎన్ని ఈవీఎంలు అవసరం అవుతాయనే వివరాలను నోట్ చేస్తున్నారు.విలేజ్ లెవల్‌లో 12 కేటగిరీలలో ఉన్న వర్కర్లను బీఎల్వోలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోగా, అందులో తెలంగాణలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, పంచాయతీ సెక్రటరీలు, వీవోఏలను బీఎల్వోలుగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,867 మంది ప్రస్తుతం బీఎల్వోలుగా పని చేస్తుండగా, వీరిలో అత్యధిక మంది అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలే ఉన్నారు. వీరికి మొబైల్ టెక్నాలజీపై పట్టు ఉండటం, గ్రామ స్థాయిలో అందరితో పరిచయాలు ఉండటం, గతంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో భాగస్వామ్యం కావడంతో ఎక్కువ జిల్లాల్లో అంగన్వాడీలు, ఆశలనే బీఎల్వోలుగా నియమించారు.ఎన్నికలకు సంబంధించిన వివరాలు గతంలో గరుడ యాప్ ద్వారా అప్డేట్ చేసేవారు. కానీ, ఇప్పుడు బీఎల్వో యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారానే కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, డెలిషన్‌కు సంబంధించిన ఫామ్స్‌ను బీఎల్వోలో అప్ లోడ్ చేస్తున్నారు.

Related Posts