విశాఖపట్టణం, జూలై 10,
స్వర్ణలత వెనక ఎవరో ఉన్నారు.. ఏదో ఒక పెద్ద చెయ్యి ఆమెను కాపాడుతోంది.. పోలీస్ అండ్ నాన్‌పోలీస్ సర్కిల్స్ ఇలా అనుమానిస్తూనే ఉన్నాయి. ఒక ఎంపీ స్థాయి మనిషి స్వర్ణలత అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారట. అందుకే… ఆమె ఎన్నో స్టేషన్లలో ఎన్నో సెటిల్‌మెంట్లు చేసినట్టు ప్రాధమిక సమాచారం ఉన్నా విచారణ దాకా వెళ్లలేదు. ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కాబట్టి ఆమెకి సివిల్ ఇష్యూస్‌తో సంబంధం లేదు. లా అండర్ ఆర్డర్‌తో లింకుల్లేవు. కానీ… నగరంలో పొలిటీషియన్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకుని వాళ్లకు అవసరమైన పనులు చేసిపెడుతూ తనక్కావల్సింది తాను స్వీకరిస్తూ దర్జాగా నడిపింది పోలీసుద్యోగం. కొన్ని కేసుల్లో నేనే టాస్క్‌ఫోర్స్ సీఐ అని చెప్పి లాండ్ సెటిల్‌మెంట్స్ చేసి… అవి స్టేషన్ దాకా రాకుండా అక్కడికక్కడే ముగించినట్టు ఆరోపణలు. కొంతమంది సీఐలు సివిల్ మేటర్స్‌లో వాళ్లు వెళ్లకుండా ఈవిడకు యూనిఫామ్ వేసి… సెటిల్మెంట్లు కానిచ్చుకునేవాళ్లట.ఇటీవల విశాఖలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కిడ్నాప్ కేసులో కూడా స్వర్ణలత మార్క్ ఆఫ్ చేతివాటం ఉందట. కిడ్నాప్ జరిగినప్పుడు మూడు రోజులు బందీలుగా ఉన్నా… రెండోరోజే సమాచారం అందుకుని వాళ్ల ఫోన్లు ట్రాక్ చేసి, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దగ్గర దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇది డిపార్ట్‌మెంట్ పరంగా పెద్ద అఫెన్స్. ఐనా… నన్నెవడ్రా ఆపేది అంటూ రెచ్చిపోయిందట మేడమ్ స్వర్ణలత.మేడమ్ స్వర్ణలత అడ్డంగా దొరికేసింది అనే బ్రేకింగ్ న్యూస్ బైటికి రాగానే… ఆమెనే నమ్ముకున్న కొన్ని పొలిటికల్ శాల్తీలు తమతమ ఐక్యూలకు పదును పెట్టుకున్నారు. ఎలాగైనా స్వర్ణలతను కాపాడాల్సిందే అంటూ ప్రభుత్వ పెద్దలపై వత్తిడి తెచ్చేశారు. వీళ్ల లాబీయింగ్ అమరావతి దాకా నడిచినట్టు తెలుస్తోంది. స్వర్ణలతను గనుక లోపలేస్తే విశాఖ పరువూ ప్రతిష్ట మంట గలుస్తుంది.. పోలీసోళ్ల కిరీటాలు కూడా కిందపడిపోగలవ్.. అంటూ బ్లాక్‌మెయిలింగ్ కూడా జరిగింది.ఎవరినైనా రిమాండ్‌కు తీసుకెళ్లే సమయంలో ఫిట్‌నెస్ టెస్టు చేస్తారు. ఇది రొటీన్ ప్రాసెస్. ఆస్పత్రిలో జరిగే ఈ ప్రాసెస్‌ని కూడా మేనేజ్ చేసిందట స్వర్ణలత. మిగతా ఏ రిమాండ్ ఖైదీకి జరపని ప్రెగ్నెన్సీ టెస్టు, రేడియేషన్ టెస్టు లాంటివి కూడా చెయ్యించుకునేలా మాయ చేసిందట. ఈవిధంగా ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉంటూ జైలు జీవితాన్నుంచి తప్పించుకోవాలన్నది ఆమె పన్నాగం. ఇందుకోసం సన్నిహిత రాజకీయ పరిచయాల్ని యదేఛ్చగా వాడుకుంది. ఆస్పత్రి ఎపిసోడ్ తర్వాత కూడా హైడ్రామా కంటిన్యూస్. స్వర్ణలతపై పెట్టిన కేసుల తీవ్రత తగ్గించేలా అన్ని కార్నర్స్ నుంచి పోలీసులకు ప్రెజర్. నాన్‌బెయిలబుల్ కాదు బెయిలబుల్ కేసులు పెట్టండి అంటూ ఫోన్లొచ్చాయట. రెండువేల నోట్ల కథలో కథానాయకురాలు ఈ స్వర్ణలతే ఐనా.. ఆమె పేరును ఏ4గా రాయబోయారు. ఇలా అడుగడుగునా ఉన్నతాధికారులకి చుక్కలు చూపించింది స్వర్ణలత మార్క్ ఆఫ్ మేజిక్.
కానీ.. 386 ఐపీసీ పెట్టాల్సిందే, పదేళ్లలు ఆమె జైల్లో ఉండాల్సిందే అని డీజీపీ ఆఫీసు నుంచి రివర్స్‌లో ప్రెజరొచ్చింది. ఇటువంటివాళ్లను ఎక్కడికక్కడ ఏరిపారేస్తేనే సభ్య సమాజానికి మనమొక మంచి మెసేజ్ ఇచ్చినట్టు..! అని అల్టిమేట్‌గా ఒక డెసిషన్‌కొచ్చేసింది ఖాకీ శాఖ. స్వర్ణలత లాంటి వాళ్లకు తగిన శాస్తి జరగాల్సిందే అనేది కమిషనరాఫ్ పోలీస్ వాదన కూడా. స్వర్ణలత ఫ్యామిలీ హిస్టరీ మాత్రం చాలా డిఫరెంట్. స్వర్ణలత మేనరిజంతో ఆమె కుటుంబానికి పోలికే లేదు. ఆమె భర్త బరోడా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ప్రస్తుతం వైస్ ఛాన్స్‌లర్ రేసులో ఉన్నాడు. స్వర్ణలత తమ్ముడైతే విజయనగరంలో పేరుమోసిన డాక్టర్. సొంత ఆస్పత్రి కూడా ఉంది. ఇంత గొప్ప నేపథ్యమున్న కుటుంబం పరువును కూడా మంటగలిపేసింది స్వర్ణలత. గ్లామర్ మీద మోజు… సంపాదనపై యావ… రాజకీయ పరిచయాల కోసం తాపత్రయం.. అన్నీ కలిసి.. తానేసుకున్న యూనిఫామ్ పరువును కూడా తీసేసింది.లోపల ఫ్రస్ట్రేషన్ పెరిగి స్వర్ణలత కనుక నోరు తెరిస్తే… బైట చాలామందికి తడిసిపోవడం ఖాయం., కొందరు ముఖ్యమైన రాజకీయ నేతల బాగోతాలు బైటపడబోతున్నాయ్.. అనే చర్చ కూడా విశాఖలో జోరుగా జరుగుతోంది. పోలీసాఫీసర్‌గా స్వర్ణలత ఎపిసోడ్.. ఇంకా ఎన్నెన్ని వంకర్లు తిరుగుతుందో చూడాలి మరి. స్వర్ణలతకు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది కోర్టు. స్వర్ణలతతో పాటు మరో నలుగురికి రిమాండ్ విధించింది.