YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనంకు ఆనంతోనే చెక్

ఆనంకు ఆనంతోనే చెక్

నెల్లూరు, జూలై 10, 
ల్లూరు జిల్లా రాజకీయాలను ఆనం కుటుంబాన్ని దూరం చేసి చూడలేం.. జిల్లా రాజకీయాల్లో చేరపలేని ముద్ర ఆనం కుటుంబానిది.. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి మొదలు, ఆనం వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి.. ఇలా ఆ కుటుంబం పేరు ప్రస్తావన రాగానే దశాబ్దాల రాజకీయ చరిత్ర చర్చకు వస్తుంది. 80 సంవత్సరాల రాజకీయ చరిత ఆనం కుటుంబానికి ఉంది.. వివేకానందరెడ్డి సోదరులు ఆనం రామనారాయణ రెడ్డి, మరో ఇద్దరు సోదరులు.. ఈ ఇద్దరూ కవలలు.. జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి.. ఆనం వివేకా జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన రోజుల్లో రాష్ట్ర స్థాయిలో తమ్ముడు రామనారాయణ రెడ్డి ఉంటే.. మరో ఇద్దరు తమ్ముళ్లు జయ, విజయ్ లు ఆనం రాజకీయ కోటకు సింహపురి ద్వార పాలకులు లాంటి వారు అనే పేరుంది. అలాంటిది వివేకానందరెడ్డి మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆనం వివేకా మరణం తర్వాత అప్పటిదాకా టిడిపిలో ఉండి.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.. అంతకంటే ముందే ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. మరో సోదరుడు జయ కుమార్ రెడ్డి మాత్రం టిడిపిలోనే ఉన్నారు.వైసీపీలో చేరిన రామనారాయణ రెడ్డి కి వెంకటగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఎమ్మెల్యే అయ్యారు.. తర్వాత కొద్దిరోజులకు విజయ్ కుమార్ రెడ్డి సతీమణికి నెల్లూరు జిల్లా జడ్పి చైర్మన్ అవకాశం ఇచ్చింది అధిష్టానం. కానీ మోస్ట్ సీనియర్ అయిన తనకు సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తి ఆనం నోట అప్పుడప్పుడు ఆరోపణలు రావడం.. ఇలాంటి చోట ఉండలేమన్న అభిప్రాయంతో పార్టీని వీడారు.. వీడిన ఆనం ఆత్మకూరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.. అలాగే జిల్లాలో మొదలైన నారా లోకేష్ యువగళం లో కీలక పాత్ర పోషిస్తున్న రామనారాయణ రెడ్డి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలాగే జిల్లాలో పది స్థానాల్లో వైసీపీని ఓడించేందుకు.. ముఖ్యంగా నెల్లూరు సిటీ లో వైసీపీని ఓడించి తీరుతానన్న శపథం చేశారట..కాగా.. నెల్లూరు సిటీ నుంచి మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఈ క్రమంలో ఆనం అనిల్ పై అనేక సందర్భాల్లో సంచలన ఆరోపణలు చేశారు.. అనిల్ కూడా ఆనం రామనారాయణ రెడ్డికి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.. ఆనం రామనారాయణ రెడ్డి తొలిసారిగా తన రాజకీయ జీవితాన్ని నెల్లూరు సిటీ నుంచే మొదలుపెట్టారు. 1983లో ఇక్కడి నుంచి పోటి చేసి గెలుపొందారు. ఆతర్వాత జిల్లాలో రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు.

Related Posts