YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి వైసీపీలో అసమ్మతి సెగలు

తిరుపతి వైసీపీలో అసమ్మతి సెగలు

తిరుపతి, జూలై 10, 
నగరి వైసీపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మంత్రి రోజాపై… వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గం మళ్లీ కత్తులు దూస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్‌ అయ్యి కొత్త చర్చకు దారితీసిన వాళ్లంతా పాత పద్ధతిలోకి వచ్చేశారు. సై అంటే సై అంటున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని సవాళ్లు విసురుతున్నారు. రోజా మంత్రి అయినా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా మాటల తూటాలు పేల్చుతున్నారు అసమ్మతి నేతలు.2014లో నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ప్రతిపక్ష పాత్రకే పరిమితం. 2019లో రెండోసారి గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆమెకు అసమ్మతి రూపంలో నేతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి. గత ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు.. తర్వాత పంచాయితీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కనిపించాయి. రోజాకు వ్యతిరేకంగా కేజే కుమార్‌, అమ్ములు, రెడ్డివారి చక్రపాణిరెడ్డి వంటి వైసీపీ నేతలు చాలా యాక్టివ్‌గా నగరిలో పనిచేస్తున్నారు. వీళ్లకు మంత్రి పెద్దిరెడ్డి తదితరుల అండ ఉందనేది రోజా వర్గం అనుమానం. నగరిలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని రోజా చెప్పినా.. ఫలితం లేకుండా పోయింది. చక్రపాణిరెడ్డి శ్రీశైలం ఆలయం ఛైర్మన్‌ అయితే.. కుమార్‌ భార్యకు నామినేటెడ్‌ పోస్టు ఇచ్చారు. అసమ్మతి వర్గాలకు సహకరిస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని రోజా పలుమార్లు హెచ్చరించినా.. నగరి వైసీపీలో పరిస్థితులు మారలేదు. ఇంతలో రోజా మంత్రి అయ్యారు. దాంతో అసమ్మతి వర్గం దారిలోకి వస్తుందని.. ఎక్కడి వాళ్లు అక్కడికి సర్దుకుంటారని చర్చ జరిగింది. దానికి తగ్గట్టుగానే రోజా మంత్రి అయిన నాటి నుంచి అసమ్మతి వాదుల ఉసే లేదు. వాళ్లంతా సైలెంట్‌ అయ్యారని భావించారంతా. కానీ.. సీన్‌ రివర్స్‌ నగరిలో జరిగిన వైసీపీ ప్లీనరలో తన జోలికి వస్తే బాక్సులు బద్దలు అవుతాయని పంచ్‌ డైలాగులు వేశారు రోజా. ఆ మాటలు మంట పుట్టించాయో ఏమో.. అసమ్మతి వర్గం ఒక్కసారిగా జూలు విదిల్చింది. తాము తగ్గేదే లేదన్నట్టుగా కేజే కుమార్‌ వర్గం ఢీ అంటే ఢీ అంటూ రోడ్డెక్కేసింది. మంత్రి రోజా అనుచరుడు బీడీ భాస్కర్‌, అసమ్మతి నేత కుమార్‌ వర్గాల మధ్య గొడవ జరిగింది. రోజా బ్యానర్లు కట్టిన చోటే అడ్డంగా కుమార్‌ వర్గం మరో బ్యానర్‌ కట్టడానికి చూడటంతో రచ్చ రచ్చ అయింది. నగరిలో వైసీపీ ప్లీనరీకి రాని అసమ్మతి నేతలు.. పలమనేరులో మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన చిత్తూరు జిల్లా వైసీపీ ప్లీనరీకి వెళ్లి.. మంత్రి రోజాకు షాక్‌ ఇచ్చారు. మొత్తానికి రోజాకు నగరి వైసీపీలో ఇంటిపోరు తగ్గేట్టు లేదు. మంత్రిగా ఉన్నా.. వాళ్లతో తలపోటులు తప్పడం లేదని అనుకుంటున్నారట. మరి.. ఈ సమస్యను అధిగమించడానికి.. అసమ్మతి వర్గానికి చెక్‌ పెట్టడానికి రోజా ఏం చేస్తారో చూడాలి.

Related Posts