YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప జిల్లా టీడీపీ లిస్ట్ రెడీ

కడప జిల్లా టీడీపీ లిస్ట్ రెడీ

కడప, జూలై 10, 
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసీపీ, టీడీపీలు అవసరమైన కసరత్తును వేగవంతం చేస్తున్నాయి. నిత్యం జనం మధ్యలో ఉండే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఎన్నికల బరిలో దింపే అభ్యర్థులపై దృష్టి పెట్టాయి. అయితే అధికార వైసీపీ మాత్రం ఉమ్మడి కడపలో దాదాపు సిట్టింగులకే టికెట్ ఖరారు చేసే అవకాశం ఉండడంతో వీటిపై ప్రత్యేక కసరత్తు చేయాల్సిన అవసరం కనిపించడంలేదు. ఆ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపిక అనే అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్య ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ఖరారు తలనొప్పిగా మారింది. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు జమ్మలమడుగు పులివెందుల మినహా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. వీటిలో కమలాపురం, మైదుకూరు నియోకవర్గాల అభ్యర్ధులపై స్పష్టత ఉన్నా ప్రకటించాల్సి ఉంది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండంతో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నది అధిష్టానానికి తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో సర్వేలకు ప్రధానం ఇస్తోంది. లోకేష్ పాదయాత్ర తర్వాత జిల్లాలో తెలుగుదేశం పార్టీ సర్వే బృందాలు పార్టీ పరిస్థితులు, జనంలో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యం ఏ మేరకు పెరిగింది. ఈ అంశాలకు జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి అంశాలతో సర్వే చేస్తున్నప్పటికీ ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కూడా సర్వే బృందాలు నిశిత పరిశీలన కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే ఆధారంగా, అలాగే అధినేత చంద్రబాబుకు జిల్లాలో నాయకులపై, జిల్లా పట్ల ఉన్న అభిప్రాయాలతో అభ్యర్థుల ఖరారుకు తుది రూపం ఇచ్చి దసరా నాటికి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలైన ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌లకు పోటా పోటీ ఏర్పడింది. ఆశా హీరో సంఖ్య సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఆరు చోట్ల అభ్యర్థిత్వాలపై సరైన స్పష్టత కనిపించకపోవడంతో దేశం కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు. ఏ నాయకుడు వద్ద పని చేయాలో తెలియక వర్గ పోరులో నలిగి పోవాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం తెలుగుదేశం పార్టీకి అంత సులువైన అంశం కాదు. అభ్యర్థిగా అవకాశం దక్కని వారు అసంతృప్తికి గురి కావడం, పార్టీకి నష్టం కలిగించే అవకాశాలకు దారితీసే పరిస్థితి ఎదురు కావడం లాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆందోళన పార్టీలో కనిపిస్తోంది.ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టికెట్ తనకే అన్న ధీమాతో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండగా టిక్కెట్టుపై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కూడా నమ్మకంతో ఉన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆశావహుల్లో ఉండగా ఇటీవల కొద్ది రోజులుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ పార్టీలో క్రియాశీలకంగా మారారు. నలుగురిలో ఎవరు అభ్యర్థి అవుతారు అన్నది స్పష్టత రావాల్సి ఉంది.కడప అసెంబ్లీలోనూ ఎక్కువమంది ఆశావహులున్నారు. అయినా ప్రధానంగా ఇద్దరు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీరిలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మిరెడ్డి కోడలు, కార్పొరేటర్ ఉమాదేవి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధవి ఉన్నారు. వీరితో పాటు నియోజకవర్గ ఇన్చార్జి అమీర్ బాబు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తారన్నది ఆ పార్టీలో ఉత్కంఠ గా మారింది.యస్సీ రిజర్వడ్ అసెంబ్లీ నియోజకవర్గం బద్వేలులో కూడా ఆశావహులసంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ మొదటి వరుసలో ఉన్నారు. పోరుమామిళ్ళకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి రోషన్న పేరు కూడా బాగా వినిపిస్తోంది. వీరు ఇరువురే కాకుండా కడపకు చెందిన మాజీ గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ గుర్రప్ప టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు.ఉమ్మడి కడప జిల్లా నుంచి వేరైన అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, నియోజకవర్గాల పైనా తెలుగుదేశం పార్టీ సర్వే బృందం అభ్యర్థులపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడి రాజంపేట అసెంబ్లీ నుండి మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చెంగల్ రాయుడు టికెట్ కేసులో ముందు వరుసలో ఉండగా రాయచోటి చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు గట్టి ప్రయత్నంతో ఉన్నారు. టికెట్‌పై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరో రిజర్వుడు నియోజకవర్గం రైల్వే కోడూరు‌లో గత ఎన్నికల్లో పోటీ చేసిన పంతగాని ప్రసాదు ఆశావహుల్లో టిక్కెట్‌పై ఖచ్చితమైన ధీమాను వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇక్కడ ప్రధాన నాయకుడైన విశ్వనాథ నాయుడుకు ప్రసాద్‌కు సరైన సంబంధాలు కనిపించడం లేదు. ఇక్కడ నుండి మరో మహిళ అనితా దీప్తి టికెట్ రేసులో ఉన్నారు. ఈమెకు విశ్వనాథ నాయుడు మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలోకి వస్తే ఇక్కడి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరే కాకుండా మరో నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇద్దరు, అంతకుమించి ఆశావహులు ఉన్నచోట నిశిత పరిశీలనతో అభ్యర్థిని ఖరారు చేసేందుకు చంద్రబాబు నాయుడు పార్టీ సర్వేలతో పాటు ఆయనకు సంబంధాలు ఉన్నా వారితో కూడా సమాచార సేకరణ చేసి తుది జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం .ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహ కర్త రాబిన్ శర్మ టీం జిల్లాలో పర్యటిస్తున్నట్లు సమాచారం.

Related Posts