YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

షర్మిల స్వరం మారుతోందా...

షర్మిల స్వరం మారుతోందా...

హైదరాబాద్, జూలై10,
గత కొద్దిరోజులుగా షర్మిల రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీని స్థాపించగా.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. వీటిని ఆమె ఖండించినప్పటికీ...తాజాగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.వైఎస్ షర్మిల.... వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ బిడ్డగానే ఉంటానని... ఇక్కడి ప్రజల కోసం పోరాడుతానంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన ఆమె... ఎన్నికల సమీపిస్తున్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. పార్టీ స్ఖాపించిన కొత్తలో బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ ఏర్పాటు అన్న చర్చ జరగింది. ఇక గత కొద్దిరోజులుగా చూస్తుంటే.... వైఎస్ఆర్టీపీ ఏకంగా కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న అంశం తెరపైకి వచ్చింది. అంతేకాదు... కొన్ని పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి.కర్ణాటక ఫలితాల తర్వాత డీకె శివకుమార్ ను కలిశారు వైఎస్ షర్మిల. ఇక్కడ్నుంచే.... వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చ మొదలైంది. డీకే డైరెక్షన్ లోనే చర్చలు నడుస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే కేవలం అభినందనలు మాత్రం చెప్పటానికే కలిశానని చెప్పుకొచ్చారు షర్మిల. అంతేకాదు... విలీనం చేయాలనుకుంటే సుదీర్ఘమైన పాదయాత్ర ఎందుకు చేస్తానని కూడా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే... ఏపీసీసీ బాధ్యతలు షర్మిలకు ఇస్తారని, ఆంధ్రా రాజకీయాల్లోకి షర్మిలంటూ సరికొత్త చర్చ కూడా మొదలైంది. వీటికి కేవీపీ లాంటి నేతల కామెంట్స్ బలం చేకూర్చాయి. ఈ విలీనం, ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ వంటి పలు అంశాలపై వస్తున్న వార్తలపై స్పందించిన షర్మిల.... తెలంగాణతోనే తన జీవితమని మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ షర్మిల రాజకీయ భవిష్యతుపై చర్చ జరుగుతూనే వస్తోంది. నిజంగా కాంగ్రెస్‌లో విలీనం చేస్తే షర్మిల తెలంగాణకు పరిమితమవుతుందా లేదా ఏపీ రాజకీయాల్లో ఆమెను చొప్పిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.షర్మిల తండ్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.దీనికి షర్మిల కూడా థ్యాంక్స్ రాహుల్ జీ అంటు బదులిచ్చారు. గతంలో రాజశేఖర్ రెడ్డి మరణం విషయంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేశారు షర్మిల. అయితే సడెన్ గా రాహుల్ గాంధీ ట్వీట్ చేయటం, ఆమె ధన్యవాదాలు తెలుపుతూనే.... మీ నేతృత్వంలో దేశం ఉజ్వల భవిష్యత్ సాధిస్తుందనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమ్మేవారనే విషయాన్ని ప్రస్తావించారు . ఈ పరిణామాలు కాస్త... వైఎస్ఆర్టీపీ విలీన ప్రక్రియకు బలం చేకూర్చనుందనే వాదన వినిపిస్తోంది. అటు రాహుల్ గాంధీ ట్వీట్, ఇటు వైఎస్ షర్మిల ట్వీట్ చూస్తుంటే కచ్చితంగా... తెలుగు రాజకీయాల్లో ఏదైనా మార్పునకు సంకేతమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో... నిజంగానే షర్మిల ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా...? లేక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారా... లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఇక విలీన వార్తలపై షర్మిలపై గత మాదిరిగానే స్పందిస్తారా...? లేక పరోక్షంగా ఏమైనా హింట్ ఇస్తారా అనేది చూడాలి...!

Related Posts