YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నట్టింట్లోనే శత్రువులు... పాపం యాదగిరి రెడ్డి

నట్టింట్లోనే శత్రువులు... పాపం యాదగిరి రెడ్డి

హైదరాబాద్, జూలై 10, 
రాజకీయాల్లోనే ఇదో వింత సమస్య.. రాజకీయాల్లో శత్రువులు కామన్.. పక్కలో బల్లెంల ఉండి అనుచరులే ప్రత్యర్థులుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు కొత్త తరహా ప్రత్యర్థి తయారయ్యారు. కక్కలేక, మింగలేక బహిరంగంగా విమర్శించలేక.. అసలు ఏం చేయాలో అర్థం కాక.. ఏమి చేయలేక సతమతమవుతున్నారు ఆ ఎమ్మెల్యే.జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చాలా వివాదాల్లో మునిగి ఇప్పటికే కాంట్రవర్సీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. అయినా నియోజకవర్గ ప్రజల్లో మాత్రం మంచి పేరే ఉంది. ఇక రాజకీయ శత్రువులు ఎలాగూ ఉండనే ఉంటారు. కానీ ఈయనకు వచ్చిన సమస్య మాత్రం చాలా డిఫరెంట్.. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ సమస్యలతో ఎదుర్కొన్నది ఎవరు లేరు. ఏదో సినిమాలో చెప్పినట్లు.. కష్టాలు ఎక్కడ ఉండవు.. నట్టింట్లో కూతురి రూపంలో ఉంటాయన్నట్లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా అదే పరిస్థితి. కన్న కూతురు తుల్జా భవాని రెబల్గా మారింది. రాజకీయ ప్రత్యర్థులను మించి నాన్న పై విమర్శలు చేస్తూ ఆయన ఇమేజ్ను డామేజ్ చేయడమే పనిగా పెట్టుకుంది. ఏకంగా ఆయన కబ్జా చేసి నాకు ఈ భూమిని రిజిస్టర్ చేశారంటూ ఓ స్థలంలో కట్టడానికి కూల్చివేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు తండ్రిపై పోలీస్ స్టేషన్లో కేసులు వేసింది. తనకు తెలియకుండా తన సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ప్రజల ముందు బహిరంగంగా నిలదీసింది. ఇలా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ.. ముత్తిరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కూతురు.నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఇబ్బందిగా మారింది. బయట వాళ్లయితే దీటుగా ఎదుర్కోవచ్చు. కానీ కన్న కూతురు బహిరంగంగా విమర్శించలేరు.. అలా అని సాధారణ రాజకీయ ప్రత్యర్థులను వేధించినట్లు వేధించలేరు. మరోవైపు ఇద్దరి మధ్య ఎందుకు ఇలాంటి విభేదాలు మొదలయ్యాయని బయటకు చెప్పుకోలేడు. మరోవైపు పార్టీ అధిష్టానం నుంచి ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించినట్లు సమాచారం. అసలే ఎన్నికల టైం ఈ రెండేళ్లు కూతురితో కొట్లాట ఇలాగే ఉంటే రాజకీయ ప్రత్యర్థులు ఈ కుటుంబ గొడవను అడ్డం పెట్టుకొని మరింత వ్యతిరేక ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కక్కలేక మింగలేక ముత్తిరెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నేతలతో బాధను పంచుకుంటున్నారట.

Related Posts