YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కనిపించని క్రిష్ణపట్టి గ్రామం..

కనిపించని క్రిష్ణపట్టి గ్రామం..

నల్గొండ, జూలై 10,
పులిచింతల ప్రాజెక్ట్‌లో ఆ గ్రామం పూ ర్తిగా మునిగిపోయింది. ముంపు బాధితులైన అక్కడి గ్రా మస్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో జరుగుతున్న అక్రమాలతో ఆ గ్రామం మళ్లీ మునిగిపోతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూనెలల తరబడి ప్రదక్షిణలు చేసినా వినతి పత్రాలకే పరిమితం అవుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. సర్వం కోల్పోయి ఊరు వదిలి వచ్చినా న్యాయం జరగ డం లేదని, పట్టాల బదలాయింపు పేరుతో లక్షలు విలు వ చేసే ప్లాట్లపై అక్రమంగా తిష్ట వేసి కోట్లు కూడగట్టుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండల పరిధిలోని క్రిష్ణపట్టి ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్ట్‌ను నిర్మించడంతో ఎగువన ఉన్న ప్రాంతంలో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అందులో భాగంగానే చింతలపా లెం మండలం అడ్లూరు గ్రామంలో ముంపు బాధితుల కోసం కోదాడ మండలం గుడిబండ ప్రాంతంలో సుమా రు 110 ఎకరాల్లో 1500 ప్లాట్ల లేఅవుట్‌తో ప్రభుత్వం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఒక్కోక్కరికి 242 గజాల చొప్పున 1220 ప్లాట్లను లబ్ధిదారులకు కే టాయించారు. అందులో అడ్లూరు ముంపు బాధితులకు 946, శోభానాధ్రిగూడెం, చింత్రియాలకు చెందిన వారికి 320 ప్లాట్లను కేటాయించారు. కాగా మిగిలిన 280 ప్లాట్లపై అక్రమార్కుల కన్ను పడింది. పులిచింతల ముం పు గ్రామాలన్నీ హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిధి లో ఉండడం, బాధితులకు ఏర్పాటు చేయబడిన అడ్లూరు ఆర్అండ్ఆర్ సెంటర్ కోదాడ డివిజన్ పరిధిలో ఉండ డంతో రెండు డివిజన్ల మధ్య తిరగడం గ్రామస్తులకు తలనొప్పిగా మారింది.ఓ పునరావాస కేంద్రం నుంచి మరో కేంద్రానికి ప్లాటును బదలాయింపు చేయాలంటే స్థానికంగా గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదం పొందాలి. కోదాడకు సమీపంగా ఉండడం ఒక్కో ప్లాట్ యావరేజ్‌గా రూ.6 నుంచి రూ .10 లక్షల ధర పలుకుతుండడంతో అక్రమార్కులు ప్లాట్ బదలాయింపు లాజిక్‌ను అదనుగా చేసుకున్నారు. కొందరు క్రిష్టపట్టి ప్రాంతంలో చివరగా ఉన్న చింత్రియాల, నక్కగూడెం, కిష్టాపురం ఆర్అండ్ఆ ర్ సెంటర్లలో ఒక్కో ప్లాట్ రూ.60 వేల చొప్పున కొనుగో లు చేశారు. అక్కడి నుంచి ఎటువంటి గ్రామసభల ఆ మోదం లేకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో నే రుగా ప్లాట్లను అడ్లూరు ఆర్అండ్ఆర్ సెంటర్‌కు బదలాయించేలా చేశారు. ఇలా సుమారు వందకు పైగా ప్లాట్ల ను అక్రమంగా బదలాయింపు పేరుతో మార్చుకుని ఆక్రమించారు. కొందరైతే నేరుగా డీటీపీ ద్వారా పట్టాలోని పేర్లను, ఫొటోలను మార్చడం, ఒకే ఎన్వోసీని కలర్ జీరాక్స్ చేసి పట్టాలు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మిన ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు 7 ఏళ్ల కాలపరిమితి అనే నిబంధన ఉండడంతో 2018లో కొనుగోలు చేసిన ప్లాట్లను అంతకు మందే కొన్నట్లుగా పట్టాలు మా ర్చారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అక్రమంగా పట్టాల బదలాయింపుతో స్థానికులకు అన్యాయం జరుగుతోందని డివిజన్ నుంచి జిల్లా అధికా రుల వరకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. పలుమార్లు హుజూర్ నగర్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నాలు చేసినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కే ఆర్అండ్ఆర్ సెంటర్‌లో అక్రమ బదలాయింపు పేరు తో కొందమంది పదుల సంఖ్యలో ప్లాట్లను హస్తగతం చేసుకున్నట్లు సమాచారం. గ్రామస్తులకు న్యాయం జరగకుండా రెవెన్యా డివిజన్ కార్యాలయంలో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులను సస్పెండ్ చేసి, సెంటర్‌లో మిగిలిన పట్టాలను గ్రామస్తులకు పంపిణీ చేయాలని అడ్లూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts