YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిజామాబాద్ రూరల్ లో గురు, శిష్యుల మధ్య పోటీ

నిజామాబాద్ రూరల్ లో గురు, శిష్యుల మధ్య పోటీ

నిజామాబాద్, జూలై 10,
నిజామాబాద్ జిల్లాలో రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ తో పాటు అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ వచ్చే ఎన్నికలలో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ పార్టీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తమ గాడ్ ఫాదర్ లను నమ్ముకుని రాజకీయంగా ఎదిగేందుకు అన్ని దారులను వెతుకుతున్నారు అక్కడ లీడర్లు. రాష్ట్రంలో కాని ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ కన్ఫామ్ చేయలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మాత్రం సీనియర్‌లుగా ఉన్న బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డిలో షబ్బీర్ అలీలు మాత్రమే తమకు టికెట్లు ఎటూ ఖాయం అంటూ ప్రచార పర్వంలో ముందుకు దూసుకెళ్తున్నారు.ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ రూరల్ అసెంబ్లి సెగ్మెంట్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ దుకుడును పెంచారు. ప్రత్యర్థి పార్టీల సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్‌లో మాత్రం గతంలో మాదిరిగానే అవకాశవాద రాజకీయాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. గత వారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తనకే అధిష్టానం ఓకే చేసిందని చెప్పుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి బాజిరెడ్డి గోవర్ధన్ కు గట్టి పోటినిచ్చిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి తనకు టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు.ఇదిలా ఉండగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్, పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి సెగ్మెంట్‌లో ప్రచారం ప్రారంభించారు. ఈ వారంలోనే తనకు పట్టున్న డిచ్‌పల్లి, మోపాల్ మండలాల్లో ప్రచార రథం ద్వారా బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం అంటుంటారు. అక్కడ అందరి అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పడం మొదలుకోని ఆ పార్టీ జాతీయ, రాష్ర్ట నాయకులపై కామెంట్‌లు అలానే చేస్తుంటారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 7 మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ కోదవ లేదు. పలు గ్రామాలలో ఆ పార్టీకి ప్రజా ప్రతినిధులు ఉన్నారు. గతంలో గెలిచిన వారు కారెక్కినా ఓటు బ్యాంక్ మాత్రం బలంగా ఉంది.దానితో పాటు ఎవ్వరికి వారు సామాజిక లెక్కలు వేసుకుని ఎలక్షన్ లో తమ లక్‌ని పరిక్షించుకునేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టి నుంచి టికెట్ అశిస్తున్న కాంగ్రెస్ నాయకులు అంతా రూరల్ నియోజకవర్గానికి చెందిన వారే. దానికి తోడు ముగ్గురు కుడా రాజకీయ అనుభవం ఉన్నవారే. అందరిలో అరికెల నర్సారెడ్డి తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి నాటి సిట్టింగ్ ప్రభుత్వానికి షాకిచ్చిన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ర్ట సమితిలోకి వెళ్లకముందు కొన్ని రోజులు కాంగ్రెస్‌లో ఉన్న 2019లో మాత్రం కారేక్కారు. అక్కడ ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతో తన రాజకీయ గురువు మండవ ద్వారా కాంగ్రెస్ పార్టాలో చేరడమే కాకుండా టికెట్ రేసులో దూసుకెళుతున్నారు.తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఏర్పడిన బీఆర్ఎస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన డాక్టర్ భూపతిరెడ్డి తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డితో పడక ఎకంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బాజిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తరుపున గట్టిపోటీని ఇచ్చారు. తనకు పార్టీ అధినాయకత్వంపై నమ్మకం ఉందని తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన కాటిపల్లి నగేష్ రెడ్డి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా చెప్పాలి.తన రాజకీయ గురువు పార్టీని వీడిన అయన మాత్రం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో మార్కెట్ కమిటీపై నగేష్ రెడ్డిదే దశాబ్ధ కాలంపాటు పెత్తనం నడిచింది. ఆర్థికంగా డోకా లేకున్న, రెడ్డి సామాజిక పరంగా ముగ్గురు కాంగ్రెస్ టికెట్‌ను అశ్రయిస్తున్నారు. ముగ్గురిలో అధిష్టానం ఎవ్వరిని ఓకే చెస్తుందనే అంశం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. కాని ఇప్పటికే ముగ్గురు ఎవ్వరికి వారు ప్రచార పర్వానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. నగేష్ రెడ్డి ఏకంగా ప్రచార రథం ద్వారా ప్రచార పర్వానికి తెర లేపడం రూరల్ కాంగ్రెస్ రాజకీయం రసకంధాయంలో పడింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో రూరల్ టికెట్‌ను ఆశిస్తున్న అభ్యర్థుల భవితవ్యం ముడిపడి ఉండగా ప్రచార పర్వానికి తెర లేపడం మాత్రం కొత్త ట్రెండ్‌గా చెప్పాలి. కాని కాంగ్రెస్ క్యాడర్‌లో మాత్రం నియోజకవర్గ అభ్యర్థిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో అని ఎదురుచూస్తున్నారు.

Related Posts