రాజోలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువులో వద్ద బోరులోంచి గ్యాస్, అగ్నికీలలుఎగసిపడుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఓఎన్జిసి అగ్నిమాపక సిబ్బంది, ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. గ్యాస్, అగ్నికీలలు గంట నుంచి ఉదృతంగా ఎగిసిపడటంతో ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలనేది సమాలోచనలు చేస్తున్నారు. చెరువులకు సుమారు 600 మీటర్లు దూరంలో డ్రైవెల్ ఉండటంతో అక్కడ ఉన్న పైప్ లైన్ నుండి లీకేజీ ఏర్పడి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్వా చెరువుల వద్ద ఉన్న బోరు లో ఉన్న సబ్ మెర్సిబుల్ పంపును ఆన్ చేయడంతో ఒక్కసారిగా గ్యాస్ ఎగసి పడి మంటలు చెలరేగడంతో భయాందోళనలో గ్రామస్థులు వున్నారు. ఓఎన్జీసీ సిబ్బంది , ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్తితిని నరసాపురం లో ఉన్న డిజాస్టర్ మానజ్మెంట్ టీం కి సమాచారం చేరవేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు.