YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రచార కమిటీలోకి పొంగులేటీ

 ప్రచార కమిటీలోకి పొంగులేటీ

ఖమ్మం, జూలై 15, 
 తెలంగాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా… టీపీసీసీ ప్రచార కమిటీని ప్రకటించింది. ఇందులో పొంగులేటికి కీలక బాధ్యతలు అప్పగించింది.మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో ఎన్నికల సమరం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లాయి. ఎవరికి వారిగా గెలిచే అభ్యర్థులపై దృష్టిపెట్టాయి. ఏ మాత్రం తేడా అనిపించినా... పక్కనపెట్టేస్తూ కొత్త వారి కోసం అన్వేషించే పనిలో పడ్డాయి. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణను కొట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ మాత్రం....గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు రకాల డిక్లరేషన్ లను ప్రకటించి... జనాల్లోకి తీసుకెళ్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షన్ పై గురి పెట్టింది. పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. త్వరలోనే కొల్లాపూర్ వేదికగా భారీ సభను నిర్వహించబోతుంది. ఇదిలా ఉంటే... వచ్చే ఎన్నికల కోసం కొత్త ప్రచార కమిటీని ప్రకటించింది కాంగ్రెస్. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందిటీపీసీసీ ప్రచార కమిటీకి గతంలో చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ గౌడ్ కు మరోసారి అవకాశం కల్పించింది కాంగ్రెస్. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రచార కమిటీలో చోటు కల్పించింది. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు ఇచ్చారు. కన్వీనర్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీల ఉండగా... మొత్తం 37 మందిని కార్యనిర్వాహక సభ్యులుగా నియమించింది.టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్, ప్రవీణ్‌ రెడ్డి, కత్తి కార్తీక గౌడ్, మహ్మద్‌ జావేద్‌ అక్రమ్, నరేంద్ర ముదిరాజ్, జూలూరు ధనలక్ష్మి గౌడ్, చనగాని దయాకర్‌ గౌడ్, వరంగల్‌ రవి, నాగన్న, అముగోతు వెంకటేశ్, రాములు యాదవ్, దాస్‌ గౌడ్, కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి, గడుగు రోహిత్, బండ శంకర్, కోలా వెంకటేశ్, దినేశ్‌ సాగర్‌ ముదిరాజ్, గోపాల్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, శ్రీకొండ మల్లేష్, కోట శ్రీనివాస్, గిరి కొండల్, సంగీతం శ్రీనివాస్, చారులత రాథోడ్, రేణుక, గిరి నాగభూషణం, భీం భరత్, కె.శివ కుమార్, సాయిని రవి, రఘువీర్‌ గౌడ్, డా.కె.విజయ్‌కుమార్, జి. లోకేశ్‌ యాదవ్, ఏఎం ఖాన్, జంగారెడ్డి, డా. వడ్డేపల్లి రవి, తాటికొండ శ్రీనివాస్, డా. మోతీ లాల్‌ను కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు.ఇక పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, కౌన్సిల్‌ నేత, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు ప్రచార కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.మరోవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పర్యవేక్షకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకు ఈ బాధ్యతలను ఇచ్చింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.

Related Posts