YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మే 28 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

మే 28 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

ఎట్టకేలకు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేశారు. షెడ్యూలు ప్రకారం.. మే 28 నుంచి 31 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. విద్యార్థులు మే 30 నుంచి జూన్ 2 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు మార్చుకోవాలనుకున్న విద్యార్థులకు జూన్ 3న అవకాశమిస్తారు. జూన్ 5న సాయంత్రం 6 గంటల తర్వాత విద్యార్థులకు సీట్లు మంజూరు చేస్తారు. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. అయితే ఈ సారి ధ్రువ పత్రాల పరిశీలనను ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టనున్నారు. దీంతో విద్యార్థులకు సహాయ కేంద్రాలకు వెళ్లే బాధ తప్పినట్లయింది. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు శుక్రవారం  విడుదల చేశారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల తనిఖీ ప్రక్రియను పూర్తి చేశారు. కొంతమంది ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల వివరాలను నమోదు చేయకపోవడంతో వారి ఫోన్లకు మెసేజ్ పంపించారు. వీరు వెబ్‌సైట్‌లో అయా వివరాలను నమోదుచేయాల్సి ఉంది. ఇలా నమోదు చేయనివారు సుమారు మూడువేల మంది వరకు ఉన్నారు. ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం వెబ్‌సైట్‌ ద్వారా ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించాలి. 

కౌన్సెలింగ్ విధానం.. 

* విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ద్వారా ఫీజు చెల్లించాలి. 

* ఫీజు చెల్లించగానే మొబైల్ ఫోన్‌కు రిజిస్ట్రేషన్‌ నంబరు వస్తుంది. ఈ నంబరును నమోదుచేస్తే..ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. 

* ఒకవేళ వివరాల్లో ఏమైనా తప్పులున్నా, ఎలాంటి వివరాలు రాకున్నా.. సమీపంలోని కౌన్సెలింగ్‌ కేంద్రానికి వెళ్లి ధ్రువీకరణ పత్రాలను సమర్పించి సరిచేసుకోవాల్సి ఉంటుది. 

* వివరాలను ధ్రువీకరించుకున్నాక పాస్‌వర్డ్‌ క్రియేట్ చేసుకోవాలి. ఫోన్‌కు లాగిన్‌ ఐడీ వస్తుంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లాక లాగిన్‌ ఐడీ, హాల్‌టిక్కెట్‌ నంబరు, పుట్టిన తేదీతో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 

కౌన్సెలింగ్ కేంద్రాలివే.. 

ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం), జేఎన్‌టీయూ(కాకినాడ), నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి), జేఎన్‌టీయూ (అనంతపురం), రాయలసీమ యూనివర్సిటీ (కర్నూలు), యోగివేమన యూనివర్సిటీ (కడప), ఆంధ్రా లయోలా కళాశాల (విజయవాడ), ఎస్‌ఆర్‌ఆర్‌-సీవీఆర్‌ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ (విజయవాడ). 

ముఖ్యమైన తేదీలు.. 

* మే 28 - 30 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు , ధ్రువపత్రాలను సరిచేసుకోవాలి. 

* మే 30, 31 తేదీల్లో 1 నుంచి 60వేల ర్యాంకులవారు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 

* జూన్‌ 1, 2 తేదీల్లో 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 

* జూన్ 3న ఆప్షన్లను మార్చుకోవడానికి అవకాశం. 

* జూన్ 5న సీట్ల కేటాయింపు. 

* ఎన్‌సీసీ, స్పోర్ట్స్, క్యాప్‌ విభాగాల వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వీరికి రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లను కేటాయిస్తారు. 

Related Posts