YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఫ్రాన్స్ పారిశ్రామిక వేత్తలతో మోడీ.. భేటీ

ఫ్రాన్స్  పారిశ్రామిక వేత్తలతో మోడీ.. భేటీ

పారిస్, జూలై 15, 
ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్నారు. బాస్టిల్ డే పరేడ్ అనంతరం.. ప్రధాని మోడీ..  పలువురు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ  పారిస్‌లో చానెల్ గ్లోబల్ సీఈవో లీనా నాయర్, ఏరోస్పేస్ ఇంజనీర్ అండ్ పైలట్ థామస్ పెస్క్వెట్, యోగా ప్రాక్టీషనర్ షార్లెట్ చోపిన్‌లతో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఛానెల్ గ్లోబల్ CEOని శ్రీమతి లీనా నాయర్ తో భేటీ అయ్యారు. ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని కలవడం ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది. హస్తకళాకారులలో నైపుణ్యాభివృద్ధిని మరింత పెంచడానికి, ఖాదీని మరింత ప్రాచుర్యం పొందేందుకు చర్చించినట్లు తెలిపారు.అయితే, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈనా నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని కలవడం చాలా ఆసక్తిగా ఉంది. వ్యాపారంలో ఇతర మహిళలు, బాలికలకు మద్దతు ఇవ్వడానికి.. ఆయన అభిరుచి, నిబద్ధతను చూడవచ్చు. భారతదేశం ప్రతి ఒక్కరికీ పెట్టుబడి కేంద్రంగా ఉండేలా ప్రధానమంత్రికి నిజంగా ఆసక్తి ఉంది. ప్రధాని మోదీతో భారతదేశ అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా హస్తకళాకారులను ఎలా ప్రోత్సహించాలి.. ఖాదీని గ్లోబల్ బ్రాండ్‌గా ఎలా తీర్చిదిద్దుతారనే దానిపై చర్చ జరిగిందని తెలిపారు.సైన్స్, అంతరిక్షం వైపు యువకులను ప్రేరేపించే విషయానికి వస్తే, థామస్ పెస్క్వెట్ పేరు ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయనను కలవడం, అనేక విషయాలపై అభిప్రాయాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అతని శక్తి, అంతర్దృష్టి చాలా విలువైనవి.. అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఏరోస్పేస్ ఇంజనీర్ – పైలట్ థామస్ పెస్క్వెట్ కీలక వ్యాఖ్యలు చేశారు.. వ్యక్తులను అంతరిక్షంలోకి పంపడం చాలా కష్టం. భారతదేశం అపురూపమైన వేగంతో చేస్తోంది. చంద్రయాన్ 3ని ప్రయోగించినందుకు భారతదేశానికి అభినందనలు.. ప్రధాని మోడీ దాని గురించి సరైన మార్గంలో ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నాను. స్పేస్ కోసం చాలా పనులు చేస్తుంది, కానీ కొన్ని చాలా స్వల్పకాలికమైనవి. రోజువారీ నావిగేషన్ సిస్టమ్, విపత్తు ఉపశమనం, పబ్లిక్ పాలసీ, పట్టణ ప్రణాళిక లేదా మౌలిక సదుపాయాల కోసం స్పేస్ నుంచి చిత్రాలను ఉపయోగించడం. అలాంటి వాటిపై దృష్టి పెట్టారు. ఇలాంటి విషయాల్లో భారతదేశం సరైన మార్గంలో ఉందని నేను భావిస్తున్నాను” అని పెస్క్వెట్ అన్నారు.షార్లెట్ చోపిన్‌ తో భేటీ అనంతరం పీఎం ట్వీట్ చేశారు. పారిస్‌లో చెప్పుకోదగిన షార్లెట్ చోపిన్‌ని కలిసే అవకాశం నాకు లభించింది. ఆమె 50 సంవత్సరాల వయస్సులో యోగాను అభ్యసించడం ప్రారంభించారు. ఆమె త్వరలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోన్నారు. కానీ యోగా.. ఫిట్‌నెస్ పట్ల ఆమెకున్న మక్కువ కొన్ని సంవత్సరాలుగా పెరిగింది.. అని ట్విట్ చేశారు.

Related Posts