YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ వైపు రాయపాటి ఫ్యామలీ చూపు

 వైసీపీ వైపు రాయపాటి ఫ్యామలీ చూపు

గుంటూరు, జూలై 15, 
ఎపీలో ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో పార్టీల్లో గోడ దూకుళ్లు కూడా మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి కుటుంబం వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అసంతృప్త నాయకులు ప్రత్యామ్నయాల వైపు దృష్టి సారిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి కుటుంబం నాలుగేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటోంది. 2019లో ఓటమి తర్వాత రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో సత్తెనపల్లి నియోజక వర్గంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను తెరపైకి తీసుకురావడం రుచించని రాయపాటి ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తోంది. తెలుగుదేశం పార్టీలో కన్నానుచేర్చుకోవడంపై రాయపాటి కినుక వహించారు. సత్తెనపల్లి నుంచి రాయపాటి రంగబాబు పోటీ చేయాలని భావించారు. రంగబాబు 2019లోనే సత్తెనపల్లి సీటు ఆశించిన టీడీపీ పట్టించుకోలేదు. రాయపాటి సాంబశివరావుతో నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేయించారు. అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలయ్యారు.ఎన్నికల్లో ఓటమి తర్వాత రాయపాటి తెలుగు దేశం పార్టీకి దూరం అయ్యారు. తాజాగా కన్నాను చేర్చుకోవడంపై అసంతృప్తి రెట్టింపైంది. పార్టీలోకి కొత్త నేతలు రాగానే సీనియర్లను పట్టించుకోలేదని అక్కసు పెరిగింది. కన్నాతో సుదీర్ఘ కాలంగా ఉన్న విబేదాలు, కోర్టువివాదాలను కొద్ది నెలల క్రితమే రాజీ ద్వారా పరిష్కరించుకున్నారు. పరువు నష్టం దావాలతో ఒరిగిదేమి ఉండదని గుర్తించడం, వయో భారం కూడా రాజీకి ఇరుపక్షాలు మొగ్గు చూపాయి. కోర్టు వివాదాలు పరిష్కారమైనా ఆధిపత్యం కోసం ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. అదే సమయంలో బీజేపీ నుంచి కన్నా టీడీపీలో చేరడం, సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించడం రాయపాటిని నిలువనీయకుండా చేసింది.దీంతో ప్రత్యామ్నయం వెదుక్కోవాలని భావించి వైసీపీ వైపు చూస్తున్నారు. అవసరమైతే సత్తెనపల్లిలో కన్నాపై పోటీ చేయడానికి రాయపాటి రంగబాబు సిద్ధమని అంటున్నారు. సత్తెనపల్లి ఇంచార్జిగా తమ కుటుంబాన్ని నియమించాలని రాయపాటి సాంబశివరావు పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలనిభావిస్తున్నట్లు తెలుస్తోంది.నిజానికి పోలవరం కాంట్రాక్టు నుంచి రాయపాటి కుటుంబానికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థను తప్పించినప్పటి నుంచి టీడీపీ అధినేతతో దూరం పెరిగింది. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్నా, పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ట్రాన్స్‌ట్రాయ్‌ను తప్పించి నవయుగను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు.ఇది రాయపాటి కినుక వహించడానికి కారణమైందిమరోవైపు రాయపాటిని వైసీపీలోకి తీసుకురావడానికి మాజీ మంత్రి,రాయపాటి శిష్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. గురువు రుణం తీర్చుకోడానికి ఆయన కుటుంబానికి రాజకీయం పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో డొక్కా వైసీపీ అధిష్టానంతో సంప్రదింపులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు వైసీపీలోకి రాయపాటి రావడం వల్ల ఉపయోగం ఏముంటందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సత్తెనపల్లిలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అంబటిని తప్పించి రాయపాటి వర్గానికి అవకాశం ఎంతవరకు లభిస్తుందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి.సామాజిక సమీకరణల కోణంలో రాయపాటి కుటుంబం రాకను వైసీపీ ఆహ్వానించినా వారిని మరోచోట సర్దుబాటు చేయడమో, ఎమ్మెల్సీ వంటి పదవిని కేటాయించడమో చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే సత్తెనపల్లిలో మాజీ ఎమ్మెల్సీ యర్రం వెంకటేశ్వర రెడ్డిని వైసీపీ పార్టీలో చేర్చుకుంది. రాయపాటి వంటి వారి రాక వల్ల కొత్తగా పార్టీకి ఒరిగే ప్రయోజనాలపై ఆ పార్టీ నేతల్లో సందేహాలు కూాడా ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలరని భావిస్తే వారిని పార్టీలోకి ఆహ్వానించవచ్చని చెబుతున్నారు.

Related Posts