YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్సీ వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపిడీవో

ఎస్సీ వసతి గృహాన్ని పరిశీలించిన ఎంపిడీవో

ఏలూరు
వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. బాగా చదువుకుని పాఠశాలకు, వసతి గృహానికి, తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కూచింపూడి సాంఘీక సంక్షేమ  ఎస్ సి బాలుర  వసతి గృహాన్ని ఆకస్మికం గా పరిశీలించారు. కొద్దిసేపు వసతి గృహ విద్యార్థులకు ట్యూటర్ గా అవతారమెత్తారు. విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, వారిలో దాగి ఉన్న నైపుణ్యత తెలుకునేందుకు, విద్యార్థుల ఆలోచనా విధానాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు వసతి గృహాన్ని పరిశీలించినట్టు ఎం పి డి ఓ రాజ్ మనోజ్ తెలిపారు. వసతి గృహం లో విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అందిస్తున్నారా అని వసతి గృహ వార్డెన్ ని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి వసతి గృహం లో ఉన్న విద్యార్థుల తో కలిసి డిన్నర్ లో పాల్గొని వంటకాలను రుచి చూసారు. భోజనానంతరం విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. వారి సమస్యలడిగి తెలుసుకున్నారు. ఉదయం బ్రేక్ పాస్ట్ లో రోజువారీ విద్యార్థులకు అందించే అల్పాహారం  పై ఆరా తీశారు. వసతి గృహం లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు.వారందరికీ  సరిపడా టాయిలెట్స్.బాత్ రూమ్ లు సక్రమం గా ఉన్నాయా అని నేరుగా పరిశీలించారు. వసతి గృహం లో విద్యార్థులు పడుకోనే రూమ్ లను పరిశీలించారు.విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే దుప్పట్లు. రగ్గులు.జంఖానాలు.బుక్స్ భద్రపరచుకోవడానికి ట్రంక్ పెట్టెలు, కాస్మోటిక్స్ వంటివి సక్రమం గా అందుతున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Related Posts