YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

108 అడుగుల శ్రీరాముడి విగ్రహం

108 అడుగుల శ్రీరాముడి విగ్రహం

కర్నూలు, జూలై 17, 
కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయానికి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే మంత్రాలయం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్షేత్రంలో ఎప్పటి కప్పుడు కొత్త కొత్త హంగులతో అభివృద్ధి చేస్తూ స్వామి వారికి నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు.అంతే కాకుండా స్వామి వారికీ గజవాహన, పల్లకి వంటి రకరకాల సేవలతో స్వామి వారికీ పూజలు చేస్తుంటారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా మరో వైపు పర్యటక కేంద్రంగా విరాజిల్లుతున్న మంత్రాలయం క్షేత్రంలో మరో విశిష్టత చేరబోతుంది. మంత్రాలయం ఆలయం సమీపంలో 10 ఎకరాల విస్తీరణంలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ విగ్రహం కోసం దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.కర్నూలు జిల్లాలో వేదభూమి అయిన రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న మఠం మంత్రాలయం ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా, మరో వైపు పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న మంత్రాలయం క్షేత్రంలో 108 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహం ఏర్పాటు కానుంది. శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో జై శ్రీరామ ఫౌండేషన్ దీనికోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.మంత్రాలయంలో ఎమ్మిగనూరు రోడ్డు వైపున ఉన్న మఠానికి చెందిన 10 ఎకరాల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మంత్రాలయంలో శ్రీరాముడి నమూనా విగ్రహాన్ని ప్రతిష్టించి చండీయాగం చేశారు. విగ్రహం, ఆలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెల 18న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ వర్చువల్గా ప్రారంభించేందుకు అంగీకరించినట్లు జై శ్రీరామ్ ఫౌండేషన్ నిర్వాహకులు ఎంపీ శ్రీధర్, కె. రాములు తెలిపారు.మొత్తం రూ.250 కోట్లతో కాంస్య విగ్రహం, చుట్టూ తొమ్మిది ఆలయాలను నిర్మించనున్నట్లు చెప్పారు. కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేస్తున్నారని, అది పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Related Posts