తనను పార్టీ నుంచి గెంటేసే కుట్ర జరుగుతుందని టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు... పార్టీ కోసం నిజాయితీగా పని చేయడమే తప్పాచంద్రబాబును నమ్మి సర్వం కోల్పోయాను అని ఆవేదన చెందారు మోత్కుపల్లి. దళితుడిని కాబట్టే అవమాన పరుస్తున్నారని పేర్కొన్నారు. తాను చేసిన తప్పు చెప్పే వరకు ఇలానే మాట్లాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు ఏపీలో హోదా ఉద్యమం నడుస్తోందని.. నాకు గవర్నర్ పదవి రాకుండా ఆపింది నిజం కాదా అని నిలదీశారు..30 ఏళ్లుగా పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్నాను. కానీ కనీసం 5 నిమిషాలు మాట్లాడేందుకు చంద్రబాబు సమయం ఇవ్వలేదు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డికి అడ్డంగా మాట్లాడినందుకే నన్ను అలా చేస్తున్నారు.తాను చేసిన తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన నాయకులను ఆకాశానికి ఎత్తుతున్నారని తెలిపారు. చంద్రబాబు కోసం దెబ్బలు తిన్నాను. ఆయనను నమ్మాను. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. రేవంత్‌రెడ్డి కూతురు పెళ్లిని చంద్రబాబు దగ్గరుండి చేయించారు. కానీ నా బిడ్డ పెల్లికి ఎప్పుడో నాలుగు గంటలకు వచ్చారు.మాల మాదిగలకు గౌరవం ఇవ్వని చంద్రబాబు.. అంబేద్కర్ విగ్రహం పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారు. చంద్రబాబు ఎందుకు చేయడం లేదన్నారు. కేసీఆర్ డబ్బులు లేని వాళ్లకు రాజ్యసభ సీటిచ్చారు. వచ్చేసారి ఏపీలో ప్రభుత్వం వస్తుందాఅని అడిగారు. తెలంగాణలో చంద్రబాబు మాటకు విలువ ఎక్కుడుందని ప్రశ్నించారు. ఆరు నెలలకు ఒక్కసారి వస్తే ఇక్కడ కార్యకర్తల పరిస్థితి ఏంటి. రేవంత్‌రెడ్డిని చంద్రబాబు నమ్మారు.. ఏమైంది, ఓ పనికిమాలిన వ్యక్తిని నమ్మి పార్టీని నాశనం చేశారు. తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని మోత్కుపల్లి పేర్కొన్నారు.