YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు వేదికలో ఉచిత విద్యుత్ తీర్మాన భేటీ

రైతు వేదికలో ఉచిత విద్యుత్ తీర్మాన భేటీ

ఖమ్మం
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉచిత విద్యుత్ తీర్మాన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం గురించి తెలిసిన వారికి అయితే కరెంట్ ఎన్ని గంటలు ఉండాలని తెలిసుంటుంది.  డైలాగులు చెప్పే వారికి ఏం తెలుసుకుందని ఘాటుగా విమర్శించారు.  నేను రైతు బిడ్డని వ్యవసాయం చేశానని చెప్పుకునే రేవంత్ రెడ్డిని చూసి ఎద్దులు పారిపోతున్నాయి. వ్యవసాయం గురించి రైతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అది తెలుసు కాబట్టే సీఎం కేసీఆర్ చెరువులను, ప్రాజెక్టులను ఏర్పాటు చేసి రైతులకు పెట్టుబడిగా రైతుబంధు ఇస్తున్నారు.  చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ ఎజెండాను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క నిజమైన కాంగ్రెస్ ఆ లేదా అని అడుగుతున్నానని అన్నారు.  రేవంత్ రెడ్డి అజెండా మోడీ అజెండా చంద్రబాబు అజెండా ఒక్కటేనని దూయబట్టారు.  వ్యవసాయాన్ని దండగ నుంచి పండగ చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.  రేవంత్ రెడ్డి విద్యుత్ పై మాట్లాడిన మాటలు రేపు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పెడతారా అని డిమాండ్ చేసారు.

Related Posts