YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో అడుగుపెట్టనున్న ప్రియాంక

ఏపీలో అడుగుపెట్టనున్న ప్రియాంక

న్యూఢిల్లీ
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ ఆగస్ట్ నెలలో ఏపీలో అడుగు పెట్టనున్నారు. ఏపీలో కాంగ్రెస్ ని పాతాళం నుంచి లేపే బాధ్యతలను ఆమె స్వయంగా తీసుకున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా సౌత్ సేట్స్ విషయంలో రాహుల్ కంటే ప్రియాంక ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఆమె కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ని విజయపధంలో నడిపించిన రికార్డుని సొంతం చేసుకున్నారు.
ఇపుడు తెలంగాణా ఎన్నికల మీద ఆమె పూర్తి దృష్టిని పెడుతున్నారు. పనిలో పనిగా ఉమ్మడి ఏపీలో మరో ముక్క అయిన ఏపీ మీద కూడా టార్గెట్ చేస్తే రిజల్ట్స్ ఎంతో కొంత సానుకూలం అవుతాయని భావిస్తున్నారుట. ఇక ఏపీ విషయంలో ప్రియాంక చాలా ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఆమె వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని చూడడం వెనక ఏపీ రాజకీయమే ఉంది అని అంటున్నారు. అదే విధంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా ఆమె గమనిస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో టీడీపీ బీజేపీతో కలసి ప్రయాణం చేద్దామని చూస్తోంది. ఒకవేళ వీలు కాకుంటే కొత్త కూటమికి కట్టేందుకు కూడా బాబు ప్లాన్ బీని రెడీ చేసి పెట్టుకునాన్నారని అంటున్నారు. ప్లాన్ బీలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు.
ఏపీలో కాంగ్రెస్ బలం పెరిగిందీ లేనిదీ దేశంలో మారే రాజకీయ వాతావరణం బట్టే ఉంటుంది అని అంటున్నారు. దేశంలో చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే 2014లో ఓడే నాటికి ఆ పార్టీ చేతిలో ఒకే ఒక రాష్ట్రం అధికారంలో ఉంది. అది కాస్తా 2015-16 నాటికి మూడు అయింది. ఈ రోజున ఏకంగా ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. సౌత్ లో కర్నాటక వంటి పెద్ద స్టేట్ ని కాంగ్రెస్ దక్కించుకుంది.
ఇక తెలంగాణాలో కనుక కాంగ్రెస్ గెలిస్తే సాటి తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా పరిణామాలు వేగంగా మారిపోతాయని అంటున్నారు. దాంతో ప్రియాంక కాంగ్రెస్ బలోపేతానికి పార్టీలో ఉన్న  పాత నాయకులను ముందుకు తేవడం అలాగే పార్టీని వీడిన వారిని చేర్చుకోవాలని కూడా ఆలోచిస్తున్నారుట. ఈ రోజుకీ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు రఘువీరారెడ్డి సాకె శైలజానాధ్ ఎం ఎం పల్లం రాజు టీ సుబ్బరామిరెడ్డి కనుమూరి బాపిరాజు చింతా మోహన్ వంటి వారు అనేక మంది ఉన్నారు.
ఇక చాలా మంది కాంగ్రెస్ ని వీడి వెళ్ళిన వారు కూడా ఆ పార్టీ కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుందంటే తిరిగి ఏపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటికీ తెలంగాణా ఫలితాలు ఒక కొలమానంగా ఉంటాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీకి వస్తున్న ప్రియాంకాగాంధీ వైసీపీ పాలన మీద సమరభేరీ మోగిస్తారు అని అంటున్నారు.
అదే టైంలో ఆమె అమరావతి రైతులను కలసి వారికి అండగా కాంగ్రెస్ ఉంటుందని చెబుతారు అని అంటున్నారు. అదే విధంగా ఏపీలో విపక్ష పార్టీల రాజకీయాన్ని గమనిస్తారని తమతో కలసి వచ్చే వారు ఎవరో ఆమె బేరీజు వేసుకుంటారు అని అంటున్నారు. ఇప్పటికైతే యూపీయే కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు మాత్రం బీజేపీ కోసం చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ కాదనుకున్నా లేక టీడీపీ వద్దు అనుకున్నా ఏపీలో కొత్త రాజకీయానికి తెర లేస్తుంది.
దానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు కానీ ఈలోగా ప్రియాంకా గాంధీ ఏపీలో చేసే పర్యటన కొన్ని సంకేతాలను మాత్రం ఇస్తుంది అని అంటున్నారు. బహుశా తెలంగాణా ఎన్నికల తరువాత కాంగ్రెస్ అక్కడ పవర్ లో వస్తే మాత్రం కచ్చితంగా ఏపీలో ఎన్నో మార్పులు జరుగుతాయని అంటున్నారు. దీంతో ప్రియాంకా ఆగస్టులో ఏపీ ఎంట్రీ మీద అందరి చూపూ ఉంది.

Related Posts