ముఖ్యమంత్రి చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. కేంద్రంలో చక్రం తిప్పటం ఖాయం అని మిట్ట మధ్యాహ్నం చంద్రబాబు కలలు కంటున్నారు. ప్రధానమంత్రి పదవి వదిలేసా అని ,గొప్ప త్యాగం చేశా అని పగటి కలలు కంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహ రావు విమర్శించారు. ఉన్న ముఖ్యమంత్రి పదవి పోతుంది అని,అటు ప్రధానమంత్రి పదవి రాదు అని సాహసం చేయలేదు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తిరుపతి లో జరుగుతున్న అర్చకులు వ్యవహారంలో భక్తులందరికి తీవ్ర మనో వేదన కు గురి అవుతున్నారని అన్నారు. ప్రధాన అర్చకులును పదవి నుంచి తొలగించడం మీకు అధికారం ఎవరు ఇచ్చారు? జీవో611 ఆధారంగా అర్చకులు ను తొలగించాంఅని చెప్పారు. మీరు ఇలా వ్యవహరించడం ముమ్మాటికీ తప్పు.కాబట్టి మీకు మీరే లెంపలు వేసుకొని తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.నలుగురు ప్రధాన అర్చకులు ను పదవుల నుంచి తప్పించడం చాలా అమానుషం.అర్చకులకు ఒక్క ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ,వాళ్ళ ఇంటికి ఒక లీగల్ నోటీస్ పంపించి ఇలా వ్యవహరించడం చాలా అమానుషమని అయన అన్నారు.