YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు

భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు

కరీంనగర్, జూలై 18,
సన్నం రకం బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. ఈ మూడు నెలల్లో వేయి రూపాయలకు పైగా రేటు పెరిగిపోయింది.. ఇంకా ధరలు పెరుగుతాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈసారి ప్రతికూల వాతవరణంతో పాటు దిగుబడి రాకపోవడంతో.. బియ్యం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా.. సన్నం రకం వరిని సాగు చేయడం తగ్గించడం.. ఇప్పుడు.. ఈ ధరల పెరుగుదలకు కారణమైంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. సన్నం రకం బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. మూడు నెలల ముందు.. తరువాత భారీ వ్యత్యాసం పెరిగింది. ఏకంగా క్వింటాకు… వేయి నుంచీ 12000 రూపాయాల ధరలు పెరిగిపోయాయి. ఈ సారి… ప్రతి కూల వాతవరణ ప్రభావం కూడా చూపింది.. అంతేకాకుండా రైతులు.. సన్నం రకం వరిని సాగు చేయడం తగ్గించారు.. దొడ్డు వరికి, సన్న వరి -మద్దతు ధర షయంలో పెద్దగా తేడా లేదు. అంతేకాకుండా సన్నం వరి సాగు చేస్తే పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల పురుగులు దాడులు చేస్తాయి. దీంతో ఎక్కువగా మందులు పిచికారి చేయాలి. గత సంవత్సరం… భారీ వర్షాల కారణంగా.. పంట నష్టం వాటిల్లింది.. ప్రతి యేటా.. సన్నాల వరి సాగు తగ్గుతూ వస్తుంది. తాజాగా సన్నాల ధరలు, ఆమాంతం పెరిగిపోవడంతో.. సన్నం వరి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కానీ… మళ్లీ పంట రావడానికి.. ఆరు నెలల సమయం పడుతుంది. పెరిగిన ధరల కారణంగా సామాన్యుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. మొన్నటి వరకు బిపిటి క్వింటాలుకు 4 వేయిల రూపాయాలు ఉండగా.. ఇప్పుడు.. 5000 వరకు అమ్ముతున్నారు. అదే విధంగా జై శ్రీరామ్… క్వింటాలుకు 5300 ఉండగా ఇప్పుడు 6 వేల వరకు అమ్ముతున్నారు.అదే విధంగా హెఎమ్టీ 5000 రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఆరు వేల వరకు అమ్ముతున్నారు. దాదాపున.. క్వింటాలు.. వేయి రూపాయల వరకు పెరిగిపోయింది. ఇంకా.. పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేసినా.. సరిగా ఎవ్వరూ తినడం లేదు.. చాలా మంది సన్నం బియ్యమే తింటున్నారు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నియోగదారులు కోరుతున్నారు. ఎన్నడూ లేని ధంగా ఒక్కేసారి క్వింటాలు వేయి రూపాయాలకు పైగా ధర పెరిగింది. బియ్యం ధరలు పెరిగిపోయాయని వినియోగదారులు అంటున్నారు. క్వింటాలు వేయి రూపాయాలకు వరకు పెరిగిందని వాపోతున్నారు.

Related Posts