YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పేదల కోసం వందే భారత్‌ సరికొత్త రైళ్ళు

పేదల కోసం వందే భారత్‌ సరికొత్త రైళ్ళు

న్యూ డిల్లీ:
కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు సామాన్యులకు గుదిబండలా మారాయి. ఆయా రైళ్లలో ఛార్జీలు ఎక్కువ ఉండటంతో సామాన్యులు ప్రయాణించలేకపోతున్నారు. వందే భారత్ రైళ్లు ప్రజలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నా అధిక ఛార్జీలను భరించలేక పేదలు మిగతా రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ఇప్పటివరకు 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వేలు అందుబాటులోకి తెచ్చాయి. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే.. కొన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని మార్గాల్లో మాత్రం ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంటోంది. అయితే పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్‌ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్‌ స్లీపర్‌, వందే మెట్రో, వందే సాధారణ్‌ రైళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు 550 కి.మీ. వరకు కవర్ చేస్తున్నాయి. వీటిలో కేవలం చైర్‌కార్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న వందే భారత్‌ రైళ్లు 550 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్‌ చేయనున్నాయి. ఇందులో మిగతా రైళ్లలో మాదిరిగానే స్లీపర్‌ బోగీలు ఏర్పాటు చేయనున్నారు.

Related Posts