YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

జూన్ 5 నుంచి టెట్ హాల్ టిక్కెట్ల డౌన్ లోడింగ్ః టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సెంటర్లు 81 10 నుంచి 19 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలుః టెట్ కన్వీనర్

జూన్ 5 నుంచి టెట్ హాల్ టిక్కెట్ల డౌన్ లోడింగ్ః టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సెంటర్లు 81  10 నుంచి 19 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు  రోజుకు రెండు సెషన్లలో పరీక్షలుః టెట్ కన్వీనర్

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టంగా అన్ని రకాల చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే దరఖాస్తు సమర్పణ ప్రక్రియ ముగియడంతో తదుపరి హాల్ టిక్కెట్ల డౌన్ లోడింగ్, మాక్ టెస్ట్ నిర్వహణ, సెంటర్ల ఎంపిక వంటి వాటికి సంబంధించి సంక్షిప్త మెసేజ్ లను అభ్యర్థులకు పంపామని టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.  తమకు నచ్చిన జిల్లా కేంద్రాలను ఆన్ లైన్ లో  ఈ నెల 25 నుంచి 29 వరకు ఎంపిక చేసుకోవచ్చని, ఒక వేళ సదరు జిల్లాలో అభ్యర్థుల పరిమితికి మించితే పక్క జిల్లాను ఎంపిక చేసుకోవచ్చని టెట్ కన్వీనరన్ స్పష్టం చేశారు. హాల్ టిక్కెట్లను జూన్ 5 నుంచి డౌన్ లోడ్ చేసుకోచ్చన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో కలిపి  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 81 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

 శ్రీకాకుళంలో 3 సెంటర్లు, విజయనగరం లో 2, విశాఖ 8, పశ్చిమ గోదావరి 3, తూర్పు గోదావరి 3, క్రిష్ణా 5, గుంటూరు 10, ప్రకాశం 3, నెల్లూరు 1, చిత్తూరు 8, తమిళనాడు 2, క డప 10, అనంతపురం 6, బెంగళూరు 6, కర్నూలు 8, హైదరాబాద్ లో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని టెట్ కన్వీనర్ తెలిపారు.  ఉదయం 9.30 నుంచి మ. 12.30 వరకు ఒక్క సెషన్ , మధ్యాహ్నాం 2.30 నుంచి 4.30 వరకు మరో సెషన్ తో మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని అన్నారు. పేపర్ 1 పరీక్షకు మొత్తం 1,69,085 మంది హాజరవుతుండగా, ఈ అభ్యర్థులకు 10,11,12 తేదీల్లో రెండు సెషన్లలో 13న ఉదయం సెషన్లలో టెట్ నిర్వహిస్తామని కన్వీనర్ తెలిపారు. అదే పేపర్ 2ఎ సోషియల్ స్టడీస్ కు 66,063 మంది పరీక్షకు హాజరవుతున్నారని, వీరికి 14న రెండు సెషన్లలో 15న ఉదయం సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. పేపర్ 2ఎ మ్యాథ్ మేటిక్స్, సైన్స్ కు 76,180 మంది పరీక్షకు హాజరవుతున్నారని, వీరికి 15 మధ్యాహ్నాం సెషన్ లో, 17న రెండు సెషన్లలో పరీక్ష వుంటుందని, పేపర్ 2ఎ ల్యాంగ్వేజస్ కు మొత్తం 70,484 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, వీరికి 18న రెండు సెషన్లలోనూ 19న ఉదయం సెషన్లో పరీక్ష వుంటుందని తెలిపారు. పేపర్ 2బి పీఈటీలకు 19న రెండు సెషన్లలో పరీక్ష వుంటుందని టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఒక్కో సెషన్ కు 27,495 మంది పరీక్షరాసే సీటింగ్ సామర్థ్యం వుందని, ఇలా రోజుకు 54,990 మంది పరీక్షకు హాజరవుతారని కన్వీనర్ తెలిపారు.  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. టెట్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులుకు కలగకుండా ఇప్పటికే దరఖాస్తు సమర్పణల ప్రక్రియ ముగించామని, తదుపరి ప్రక్రియను కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Related Posts