YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ 2014 కూటమే..

మళ్లీ 2014 కూటమే..

న్యూఢిల్లీ, జూలై 19, 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల షెడ్యూలు దగ్గర పడుతుండడంతో వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తుంది. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉండటంపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో టీడీపీ పార్టీ చేరి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాడుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  ప్రధానమంత్రి మోడీ కలలను సాధించడానికి కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరం అని అన్నారు. ఎన్డీయే సమావేశానికి 38 పార్టీలు హాజరవుతుండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సమావేశానికి టీడీపీని ఆహ్వానించలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగే కీలక సమావేశానికి టీడీపీని ఆహ్వానించలేదు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని పవన్ అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంతో పాటు రాబోయే ఎన్నికల్లో పొత్తులు,సీఎం పదవి వంటి అంశాలపై ఎన్డీయే భేటీలో పాల్గొనడానికి ముందు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.  వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని డెవలప్ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. సీఎం ఎవరనేది సమస్య కాదని, జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటోందన్నారు. అయితే క్షేత్రస్థాయి బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ ఇష్యూ ఉందని వ్యాఖ్యానించిన జనసేన అధినేత.. వాళ్ల మధ్య ఉన్న సమస్యపై తాను మాట్లాడలేనని కామెంట్ చేశారు. అయితే కచ్చితంగా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయని భావిస్తున్నట్టు పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది తన విధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల తరువాత తమ కూటమి విజయం సాధిస్తే.. సీఎం ఎవరనేది సమస్య కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పార్టీ వైపు చూస్తున్న పలువురు నేతలు
 పవన్ కల్యాణ్ విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పవన్ విమర్శలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోయింది. పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచడం.. టీడీపీ సైలెంట్‌గా ఉండటంతో వలసలు పెరుగుతున్నాయి. జనసేనలోకి చేరికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విశాఖకు చెందిన వైసీపీ నేత పంచకర్ల రమేశ్ బాబు, ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి స్వాములు ఇప్పటికే జనసేనలో చేరారు. అయితే తాజాగా మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ పొలిటీషియన్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని గతంలో ప్రకటించారు. త్వరలోనే ప్రధాన పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఇందులో భాగంగా డీఎల్ రవీంద్రారెడ్డి జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. ఈనెలలోనే జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారని ప్రచారం జరుగుతుంది. డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరతారని అంతా భావించారు. అయితే మైదుకూరు నియోజకవర్గం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరడం వృథా అని భావించిన డీఎల్ రవీంద్రారెడ్డి ఇక జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అంగీకరిస్తే మైదుకూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది.డీఎల్ రవీంద్రారెడ్డి 1978లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. మైదుకూరు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978 నుంచి 2009 వరకు శాస‌న‌స‌భ‌కు ఎనిమిది సార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందారు. 1978, 1983,1989, 1994,2004,2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985,1999లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే 2012లో కడప పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారు. ఇకపోతే డీఎల్ రవీంద్రారెడ్డి 1991 నుంచి 1994 మ‌ధ్య నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ల మంత్రివ‌ర్గంలో చిన్ననీటిపారుద‌ల‌, విద్యుత్తు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ‌ల‌ మంత్రిగా పని చేశారు. అలాగే 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివ‌ర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, రాజీవ్ ఆరోగ్య శ్రీ, 108, 104, కుటుంబ‌ సంక్షేమ, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండ‌లి శాఖ‌ల మంత్రిగా డీఎల్ రవీంద్రారెడ్డి పని చేశారు.

Related Posts