YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సామాన్యులకు వందేభారత్

సామాన్యులకు వందేభారత్

ముంబై, జూలై 19, 
సామాన్యులు ఎదురుచూసే కొత్త నాన్-ఏసీ రైలును అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది భారతీయ రైల్వే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పెంచిన తర్వాత.. భారతీయ రైల్వేలు ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లతో కొత్త రైలును తయారు చేయాలని భావిస్తోంది. కొత్త రైలు పేరు ఇంకా నిర్ణయించలేదు. అయితే సామాన్యులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ రైలును తయారు చేయాలనే ఆలోచన చేస్తోంది.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో కొత్త రైలులో కొన్ని ఫీచర్లు ఉంటాయని ఓ అధికారి తెలిపారు. భారతీయ రైల్వేలు ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్, సెకండ్ క్లాస్ 3-లెవల్ స్లీపర్ కోచ్‌లతో కొత్త వందే ఆర్డినరీ రైలును ప్రవేశపెట్టాలని చూస్తోంది.కొత్త రైలు పేరును ఇంకా నిర్ణయించలేదు. అయితే దీనికి వందే సాధారణ్ లేదా వందే అంత్యోదయ అని పేరు పెట్టే అవకాశం ఉంది. సామాన్యులకు మెరుగైన ప్రయాణం కోసం ఈ రైళ్లను తయారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో కొత్త వందే సాధనన్ ఎక్స్‌ప్రెస్‌కు కొన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఒక అధికారి మీడియాకు తెలిపారు. వందే భారత్, వందే సాధన్ రైలు మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏంటంటే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపుల నుండి ఆటోమేటిక్ రైలు, మరోవైపు వందే సాధన్ లోకోస్ ద్వారా నడుస్తుంది. సమస్య ఏంటంటే చాలా రైళ్లు లోకోమోటివ్ ద్వారా లాగబడతాయి.. కానీ దీనికి రెండు చివర్లలో లోకోమోటివ్‌లు ఉంటాయి.ముఖ్యంగా, రైలును వేగవంతం చేయడానికి ప్రతి చివర ఒక లోకోమోటివ్‌తోపాటు పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది చివరి స్టేషన్‌లో లోకోమోటివ్ రివర్సల్ చేసుకునే అవసరం ఉండదు. తద్వారా టర్నరౌండ్ సమయం తగ్గుతుంది. LHB రైలులో 2 సెకండ్ లగేజీ, గార్డు, దివ్యాంగులకు అనుకూలమైన కోచ్‌లు, 8 సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అన్ని కోచ్‌లు నాన్-ఏసీగా ఉంటాయి.కొత్త వందే సాధరణ రైలు ఇంజన్లు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో తయారు చేయబడుతున్నాయి. రైలు కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తారు. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న భారతీయ రైల్వేల ఏకైక కోచ్ ఫ్యాక్టరీ ICF. ఈ ఏడాది చివరి నాటికి కొత్త రైలు నమూనా సిద్ధమవుతుందని, అక్టోబర్‌లో రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే అధికారి మీడియా నివేదికలో తెలిపారు.

Related Posts