YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ కు బండి దూరం...?

కరీంనగర్ కు బండి దూరం...?

కరీంనగర్, జూలై 19, 
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)  రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… కరీంనగర్‌కు దూరం.. దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత.. ఒక్కే ఒక్కసారి వచ్చి వెళ్లిపోయారు. అది కూడా.. కొన్ని గంటల పాటు ఉండిపోయారు. తరువాత… కరీంనగర్‌కు రాలేదు. ఆదివారం జరిగిన టిపిన్ బైఠక్‌లో.. సంజయ్ పాల్గొనలేదు.. రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత.. దూకుడు తగ్గించారనే ప్రచారం సాగుతుంది. బండి సంజయ్ అనుచరులు కూడా మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో కూడా బీజేపీ కార్యక్రమాలు కొద్దిగా తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. మందు నుంచి దూకుడుగా ఉండే బండి ఒక్కసారిగా సైలెంట్ ఎందుక్కయ్యారు.. ఈ నిశ్శబ్దం వెనుక ఏముంది..? బండి ప్లాన్ ఏంటి..? బండి సంజయ్ మనస్సులో ఏముంది..ఇప్పడు కరీనంగర్‌లో ఇదే చర్చ జరుగుతోంది.బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్… ఏ కార్యక్రమం చేపట్టిన కరీంనగర్ నుంచే మెదలు పెట్టేవారు. ఎంత బిజీగా ఉన్నా.. వారానికి ఒక్కసారి కరీంనగర్‌కు వచ్చేవారు. అయితే.. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరువాత.. ముఖ్య మైన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కరీనంగర్‌కు ఒకే ఒక్కసారి ఒక్కసారి వచ్చి పోయారు. అదే విధంగా.. తీగలకుంటపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి విషయంలో.. బీఆర్ఎస్, బీజేపీకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి సంజయ్ హాజరుకాలేదు. ఈ అభివృద్ధి పనులను మంత్రి గంగులతో పాటు వినోద్ కుమార్ ప్రారంభించారు. ఇక్కడ బీజేపీ-బీఆర్ఎస్ నేతల మధ్య కొంత గొడవ జరిగింది.. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు మళ్లీ సైలెంట్ అయ్యారు.సంజయ్.. పత్రిక ప్రకటన మాత్రం చేశారు. ఈ విషయంలో- తిరిగి బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అదుకు భిన్నంగా తిరిగి మాట్లాడినవారు లేరు. అయితే, సంజయ్ సూచనతో సైలెంట్ అయినట్లుగా సమాచారం. అదే విధంగా ఆదివారం జరిగిన లేపిన్ బైఠక్‌లో కూడా, సంజయ్ పాల్గొనలేదు.. అంతకుముందు జరిగిన టిపిన్ బైఠక్‌ సంజయ్ పాల్గొన్నారు.రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత.. సైలెంట్ అయ్యారనే చర్చ సాగుతుంది. అదే విధంగా ఆయన అనుచరులు కూడా పోషల్ స్టడియాలో పోస్టింగ్లు. తగ్గించారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఇదే ధంగా సైలెంట్ ఉంటే… పార్టీ ప్రభావం చూపుతుందనే చర్చ సాగుతుంది. సంజయ్ సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదని.. ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.

Related Posts