Highlights
- రషీద్ ఖాన్ అల్ రౌండ్ ప్రదర్శన
- రేపు చెన్నై తో తుది పోరు
- కోల్‌కతా నైట్‌రైడర్స్ నిష్క్రమణ
ఐపీఎల్-11 లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లోనూ తలపడబోతున్నాయి. చెన్నైతో తొలి క్వాలిఫయర్లో చేతిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకున్న సన్‌రైజర్స్, ఈ సారి సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన రషీద్ ఖాన్ (10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 నాటౌట్), బౌలింగ్ (3/19)లో ఎప్పటిలాగే చెలరేగి జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం చెన్నైతో తలపడుతుంది. ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం రైజర్స్‌కు ఇది రెండోసారి.