YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం
గత మూడు  రోజులనుండి నగరంలో కురుస్తున్న వర్షాలతో పలు  లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బేగంపేట్, పారడైస్ ,సికింద్రాబాద్ స్టేషన్,మొండా మార్కెట్,జనరల్ బజార్, సీతాఫలమండి, చిలకల గూడ ప్రాంతాలలో వర్షపు నీరు భారీగా నలిచిపోయింది.
మరోవైపు భద్రాచంలో భారీ వర్షాల కారణంగా రామాలయం అన్నదాన సత్రం విస్తా కాంప్లెక్స్ ప్రాంతాలకు  బ్యాక్ వాటర్ చేరుకుంది. దాంతో అధికారులు మోటర్లతో నీటిని తోడి గోదావరిలోకి విడిచిపెడుతున్నారు.

సిద్దిపేట జిల్లాలో కుంభవృష్టి
సిద్దిపేట జిల్లా చేర్యాల, ధూల్మిట్ట, కొమురవెళ్లి మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆకునూరు వద్ద మోహితుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోహెడ మండలం బస్వపూర్ వద్ద బ్రిడ్జి పై నుండి నీళ్లు పారుతున్నాయి.  వరంగల్ సిద్దిపేట మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి.

ఉదృతంగా గోదావరి..అధికారులు అప్రమత్తం
గత మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతుంది. బుధవారం రాత్రి 34 అడుగుల వద్ద వున్న గోదావరి గురువారం ఉదయానికి 39 అడుగుల వద్ద ప్రవహిస్తుంది..  43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు.. ఎగువన ఉన్న తాలిపేరు.. మేడిగడ్డ.. ప్రాజెక్ట్ ల నుండి భారీగా వరద నీటిని విడుదల చేయడం తో వరద మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. నిన్న కలెక్టర్ ప్రియాంక ఆలా వరద పరిస్థితి పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి తీసుకోవలసిన జాగర్తలు పై చర్చించారు.. పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు.

తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 75 గంటలుగా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నాలాలు పొంగడంతో  పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారాలు నీట మునిగాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో పలు చోట్ల  చెట్లు విరిగిపడ్డాయి. గురువారం నాడు జిహెచ్ ఎంసీకి  60కి పైగా ఫిర్యాదులు అందాయి. మాదాపూర్ 5 సెం.మీ, కెపిహెచ్ బి 4.98 సెం.మీ, మూసాపేట 4.73 సెం.మీ, జూబ్లీ హిల్స్  4.65 సెం.మీ. మియాపూర్ లో 7.40 సెం.మీ.వర్షపాతం. టోలీ చౌకీ 6.65 సె.మీ, హైదరాదాద్ 5.68 సెం.మీ వర్షపాతం నమోదయింది.

భద్రాద్రిలో హై అలర్ట్
భద్రాచలం వద్ద  గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని అదేశించారు. 24 గంటలు పనిచేసే విధంగా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయాలు అలాగే చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద ఈ రోజు సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏ ఒక్క ప్రాణానికి హాని కలుగ కుండా ప్రజలకు కానీ పశువులకు కానీ చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎప్పటి కపుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.  ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. గురువారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి. 781614 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుండి వచ్చే వరదలతో క్రమేపీ గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు  గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నీళ్లు చేరే వరకు ప్రజలు వేచి ఉండొద్దని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.  పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని, ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దని,  ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పారు.  జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. పశువులను మేతకు వదల కుండా ఇంటి పట్టునే ఉంచాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా జరిగేలా  చర్యలు చేపట్టాలన్నారు. మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవ సమయం దగ్గరగా ఉన్న గర్భిణీలను ఆసుపత్రులకు తరలించాలన్నారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. భద్రాచలంలో స్నానఘాట్లు వద్ద భక్తులు దిగకుండా నియంత్రణ చేయాలని, నియంత్రణకు  గస్తీ పెంచాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు
చేయాలన్నా రు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలన్నారు. భాదితులకు నాణ్యమైన, పరిశుబ్రమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

Related Posts