YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పట్టిసీమ నుంచి డెల్టాకు నీళ్లు

పట్టిసీమ నుంచి డెల్టాకు నీళ్లు

విజయవాడ, జూలై 21, 
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టిసీమ ద్వారా మళీ కృష్ణా డెల్టా కు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి అంబటి కీలక ప్రకటన చేశారు.పట్టిసీమ ద్వారా మళ్ళీ కృష్ణా డెల్టా కు నీళ్ళు ఇవ్వాలనీ నిర్ణయించామన్నారు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టి సీమ ద్వారా నీళ్ళు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుతామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా కూడా 5 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.కృష్ణా నది ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని లిఫ్ట్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు కురవడం., ఎగువ నుంచి నీరు విడుదల కావడంతో గోదావరి నీటి అవసరం కృష్ణా డెల్టాకు రాలేదన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో... పట్టిసీమ ద్వారానే మళ్లీ కృష్ణా డెల్టాలకు ఇవ్వాల్సి వస్తోందన్నారు.ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోందన్నారు మంత్రి అంబటి. ఇది 8 లక్షల క్యూసెక్కుల కు పెరిగే అవకాశం ఉందన్నారు. డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బ తిందని... అయితే కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది నిర్ణయిస్తామన్నారు. ఈ విషయంపై కేంద్ర జల సంఘానికి నివేదిక ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాలు వల్ల స్వల్పంగా ఏపీలోని గోదావరి తీర ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తోంది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది.
గోదావరికి భారీ వరద
గోదావరికి భారీగా వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు తెలంగాణలోనూ భారీగా వానలు పడుతున్నాయి. ఫలితంగా గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. భద్రాచలం వద్ద నీటిమట్టం 40 అడుగులు దాటిపోవటంతో… ప్రమాద హెచ్చరికలు జారీ కానున్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గం.ల సమయానికి 41.3 అడుగులకు నీటి మట్టం చేరింది.  43 అడుగులకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు.గోదావరిలో ఎగువన ప్రవాహం నామమాత్రంగా ఉన్నప్పటికీ.. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో పరిసర ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. భద్రాచలం వద్ద  గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని అదేశించారు. 24 గంటలు పనిచేయు విదంగా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయాలు అలాగే  చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద ఈ రోజు సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏ ఒక్క ప్రాణానికి హాని కలుగ కుండా ప్రజలకు కానీ పశువులకు కానీ చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎప్పటి కపుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు.  ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్‌ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్‌ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీరు చేరుతుంది.  కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు. కాగా… ప్రస్తుతం నీటి మట్టం 399.80 అడుగులుగా ఉంది.కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 690.500 అడుగులకు చేరింది. కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Related Posts