YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రెండింతలు పెరిగిన ఆన్ లైన్ ఆర్డర్లు

రెండింతలు పెరిగిన ఆన్ లైన్ ఆర్డర్లు

హైదరాబాద్, జూలై 21, 
హైదరాబాద్ నగరంలో మూడు రోజులుగా ఎడతెరిపిగా కురుస్తున్న వర్షంతో స్విగ్గి, జొమాటో, బిగ్ బాస్కెట్ తదితర డెలివరీ ఏజెన్సీలకు రోజుకు 3.30 లక్షల ఆర్డర్‌లు పెరిగాయి. దీంతో ఈ డెలివరీలను బాయ్స్ అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 32 వేల మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. వీరు సాధారణ రోజులలో కనీసం 6 డెలివరీలు చేస్తుంటారు. ఈ మూడు రోజులలో వర్షం ఆగకుండా పడుతుండడంతో నగర ప్రజలు ఇప్పుడు డెలివరీ బాయ్స్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షం రోజులలో డెలివరీ బాయ్స్‌కు ఒకరికీ కనీసం 30 ఆర్డర్‌లు కచ్చితంగా వస్తున్నాయి. వాటిని డెలివరీ చేసేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ గిగ్, ప్లాటఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సలా ఉద్దీన్ ఆర్డర్‌లు ఎక్కువగా వస్తున్నాయని డెలివరి బాయ్స్ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వర్షం కారణంగా ఆర్డర్‌లు పెరిగాయని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ఉదయం నిత్యావసరాల సరుకులు, టిఫిన్స్, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో గరం గరం వెజ్, చికెన్, మటన్ బిర్యానీల ఆర్డర్‌లు పెరిగాయని ఆర్డర్స్ లెక్కలు చెప్పుతున్నాయి.

Related Posts