YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

చితికి పోతున్న బ్యాంకింగ్ రంగం

చితికి పోతున్న బ్యాంకింగ్ రంగం

మోడీ ప్ర‌భుత్వ విధానాలు బ్యాంకుల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారుతున్నాయి. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్ర‌తిపాద‌న‌, ఇత‌ర బ్యాంకింగ్ చ‌ట్టాలు వంటివి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను భారీ న‌ష్టాల‌కు గురి చేస్తున్నాయి. ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం 2018, మే 11తో ముగిసిన పదిహేను రోజుల కాలానికి బ్యాంకుల రుణాలు 12.64 శాతం పెరిగి రూ.85,51,099 కోట్లకు చేరుకున్నాయి. 2017,మే 12తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకుల రుణాలు రూ.75,90,941 వద్ద స్థిరంగా ఉన్నాయి. అదే 2018, ఏప్రిల్ 27తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకు రుణాలు 12.61 శాతం పెరిగి, 85,38,570గా నమోదు కాగా, 2017, ఏప్రిల్ 28తో ముగిసిన 15 రోజుల కాలంలో బ్యాంకుల రుణాలు 75,82,391 కోట్లు. బ్యాంకు డిపాజిట్ల విషయానికి వస్తే, మే 11తో ముగిసిన పదిహేను రోజుల్లో 7.61 శాతం పెరిగి 1,13,92,165 కోట్లకు చేరుకున్నాయి, 2017 ఇదే కాలంలో డిపాజిట్ల మొత్తం రూ.1,05,86,083 కోట్లు. 2018, ఏప్రిల్ 27తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో డిపాజిట్లు 8.20 శాతం పెరిగి రూ.1,14,30,786కు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో ప్రాధాన్యేత‌ర‌ బ్యాంకు రుణం 8.4 శాతం పెరిగింది. 2017 మార్చిలో కూడా ఇదే రేటు కొనసాగింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాలు 2018, మార్చిలో 3.8 శాతం పెరిగాయి. అదే 2017, మార్చిలో వీటి పెరుగుదల 12.4 శాతం. పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు 2017 మార్చిలో ఇవి 1.9 శాతం త‌గ్గ‌గా, అదే 2018, మార్చిలో 0.7 శాతం పెరగ‌డం శుభ‌ప‌రిణామం. 

Related Posts