YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యాక్షన్ లో దిగిన కిషన్

యాక్షన్ లో దిగిన కిషన్

హైదరాబాద్, జూలై 22, 
బీజేపీ స్టేట్ చీఫ్‌గా ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమస్యలపై దృష్టి పెట్టారు. 9 డిమాండ్లు నెరవేర్చాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ధరణి సమస్య పరిష్కరించాలని, రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు అందజేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపు నిచ్చిన కిషన్‌ రెడ్డి… అధ్యక్షుడి హోదాలో తొలి పర్యటనను గజ్వేల్‌ నుంచే మొదలు పెట్టనున్నారు. అక్కడ జిల్లా బీజేపీ నాయకులతో సమావేశమై స్థానిక సమస్యపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.అలాగే గజ్వేల్‌లో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. కిషన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్థానిక బీజేపీ నాయకులు… అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు సిద్ధమైయ్యారు. ఇక తెలంగాణలో BRSకు ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న కిషన్‌ రెడ్డి… చేరికలపై కూడా స్పెషల్‌గా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే కిషన్ రెడ్డితో పలువురు నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, తాండూరు లక్ష్మారెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. అలాగే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు గాలం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి.. ఈసారి ఏ రకమైన విధానాలతో ముందుకు సాగుతారు ? బీజేపీ గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.

Related Posts