YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కృష్ణాకు ఎన్టీఆర్, పశ్చమకు అల్లూరి పేర్లు

 కృష్ణాకు ఎన్టీఆర్, పశ్చమకు అల్లూరి పేర్లు

 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో నామకరణోత్సవ యాత్ర సాగిస్తోందన్న ప్రచారం సాగుతోంది. కొన్ని రోజులకిందట కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ఆర్భాటంగా ప్రకటించిన జగన్, ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఈ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతానంటూ ఘనంగా హామీ ఇచ్చేశారు. తెలుగుజాతిని ప్రభావితం చేసిన వ్యక్తుల మీద జగన్ కు ఉన్న ప్రేమాభిమానాలు ఎలాంటివో గానీ.. ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు మాత్రం స్థానికంగా ఉండే కులబలాల్ని పరిగణనలోకి తీసుకునే ఇలాంటి నామకరణ హామీలు గుప్పిస్తున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.జగన్ మోహన్ రెడ్డి.. తాను ప్రభుత్వంలోకి వస్తే చేస్తా అనడమే తప్ప.. ఒక నిర్దిష్టమైన సమస్యను ఎంచుకుని.. తాను ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా ఆ సమస్య కోసం పోరాడుతా అనే ధోరణి ఇప్పటిదాకా కనిపించడం లేదు. రాష్ట్రమంతా తిరుగుతూ.. అన్ని వర్గాల ప్రజలకూ అది చేసేస్తా.. ఇది చేసేస్తా అంటూ సాగుతున్న జగన్.. వాటన్నింటికీ కూడా.. ‘తాను సీఎం అయితే’ అనే అంశాన్ని జోడిస్తుండడం విశేషం.కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడతానంటూ.. చంద్రబాబు మీద ఆ సామాజిక వర్గంలో ఒక విముఖత సృష్టించడానికి జగన్ స్కెచ్ వేశారు. అరె , ఇన్నాళ్లుగా పదవిలో ఉన్నా.. ఎన్టీఆర్ కోసం చంద్రబాబు ఇలాంటి హామీ ఎన్నడూ ఇవ్వలేదే.. అని ఆ వర్గం ప్రజలే అనుకోవాలని , అనుమానంగా చూడాలని ఆయన కోరుకున్నారు. అదే పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చేసరికి ఆయనకు అల్లూరి సీతారామరాజు గుర్తుకు వచ్చారు. రాజుల ప్రాబల్యం పుష్కలంగా ఉండే ఈ జిల్లాలో అల్లూరిని స్మరించుకోవడం అచ్చంగా కులాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమే అని చెప్పాలి. బహుశా ఈ హామీలు గుప్పించడానికి ముందు, పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన నాటినుంచి కూడా.. గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఛీత్కరించుకున్న జిల్లా ఇది.. అనే స్పృహ కూడా ఆయనను వెన్నంటి వస్తూ ఉన్నదేమో. మొత్తానికి ఈ జిల్లాను ఏ రకంగా అయినా తన బుట్టలో వేసుకోవాలని జగన్ ఆశించడం సహజం. అందుకే అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గురించి ఆయన ప్రతిపాదించారని అనుకుంటున్నారు.

Related Posts