కడప, జూలై 24,
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో అనేక కీలక విషయాలు ఉన్నాయి. తాజాగా వివేకా కుమార్తె సునీత ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో పలు విషయాలను సునీత వెల్లడించారు. వివేకా హత్య కేసు ఛార్జ్‌షీట్‌తో సునీత వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారు. కేసు విచారమ జరుగుతున్న సమంయలో ..ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న భారతి ఫోన్ చేశారని సీబీఐకి సునీత వాంగ్మూలం ఇచ్చారు. తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్ వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని.. ఎక్కువ టైం తీసుకోనంటూ భారతి వెంటనే ఇంటికి వచ్చేశారన్నారు. వైఎస్ భారతి వెంట విజయలక్ష్మి, అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు. లిప్టు దగ్గరే నిలబడి భారతి తనతో మాట్లాడారని.. వైఎస్ భారతి ఆందోళనగా ఉన్నట్టు నాకు అనిపించిందన్నారు. నాన్న మృతి తర్వాత తొలిసారి ఇంటికొచ్చినందున భారతి బాధగా ఉన్నారని అనుకున్నానన్నారు. ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని భారతి తనకు చెప్పారని సీబీఐకి తెలిపారు. మీడియాతో మాట్లాడాలని తనకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారన్నారు. సజ్జల ఆలోచన ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ విడియో పంపించానన్నారు. అయితే వీడియో కాదు అంశానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల చెప్పారన్నారు. జగనన్నతోపాటు అవినాశ్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల అన్నారని.. తాను అప్పటివరకు అవినాష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు తాను అనుమానించానని సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. సజ్జల సలహా మేరకే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టానన్నారు. అవినాష్ అభ్యర్థిత్వానికి మా నాన్న కోరుకోలేదని తెలుసని సునీత స్పష్టం చేశారు. రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా గొడవలున్నాయన్నారు. గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని తాను అడిగానని పొరపాటు జరిగిందని తెలుసు.. క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోలేదన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని..– ఎవరో చేసిన పొరపాటుకు మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని తెలిపారు. మార్చురీ బయట ఉంటే ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారని.. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, టీడీపీ నేతలపై ఆరోపణలున్నాయన్నారు. వివేకా ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాష్ నాకు చెప్పారని సునీత తెలిపారు. టీడీపీ నేతలు మనసులో పెట్టుకొని ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్ అన్నాడని సునీత వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదుపై నేను సంతకం చేయలేదన్నారు. 2019 జులైలోనే అవినాష్ రెడ్డిపై తనకు అనుమానం వచ్చిందని.. – మా కుమారుడికి ముందే తెలుసునని గజ్జల ఉదయ్ రెడ్డి తల్లి ఓ వ్యక్తితో అన్నారన్నారు. మృతి విషయం బయటకు రాకముందే కుమారుడికి తెలుసునని ఎలా చెప్పారు? – అవినాష్, శివశంకర్ రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి అనుమానం వచ్చిందని సునీత తెలిపారు. భారతి, సజ్జల తనతో జరిపిన వాట్సాప్ చాట్ వివరాలను సీబీఐకి సునీత ఇచ్చారు.