YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శివలింగంపై సైంటిఫిక్ సర్వే

శివలింగంపై సైంటిఫిక్ సర్వే

లక్నో, జూలై 24, వారణాసిలోని ప్రఖ్యాత జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులో సైంటిఫిక్ సర్వే చేయించాలన్న హిందూ సంఘాల తరపు న్యాయవాదుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న వారణాసి కోర్టు అందుకు తగినట్లుగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించే పనులను మొదలుపెట్టారు. కాశీలో విశ్వనాధుడి ఆలయాన్ని ఆనుకుని ఉండే ఈ మసీదు హిందూ దేవాలయమని హిందువులు, కాదు ఇది మసీదు మహమ్మదీయుల మధ్య మొదలైన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. గతంలోనూ కోర్టు ఆదేశాలతో అధికారులు సర్వే చేపట్టగా ఓ శివలింగం లాటి ఆకృతి మసీదులో వెలుగు చూసింది. అయితే అది శివలింగం కాదని వాటర్ ఫౌంటేన్ అని ఇస్లాం మత పెద్దలు కోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న వారణాసి కోర్టు..ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తో సైంటిఫిక్ సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేయటంతో ఈ రోజు అధికారులు సర్వే మొదలు పెట్టారు.

Related Posts