YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం వైపు గంటా దృష్టి

విజయనగరం వైపు గంటా దృష్టి

ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. పార్టీలు మారడం ఆయనకు పిల్లి పిల్లలను మార్చినంత తేలిక. పార్టీలే కాదు.. నియోజవర్గాలు అలానే మారుస్తుంటాడు. అలాంటి గంటా ఇప్పుడు జనసేన అధినేతతో మాట్లాడారనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ తోను ఆయన టచ్ లో ఉన్నాడని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన మాట. అంటే గంటా గోడ మీద పిల్లి అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే గంటా అక్కడ చేరిపోతారని ప్రస్తావించారు. గంటా ఏ పార్టీలోకి వెళ్లిన మంత్రి పదవి తీసుకోవడం సాధారణ విషయమైంది. అధికార పార్టీలోనే ఆయన ఉంటారు. అదే పార్టీ విజయం సాధిస్తోంది. అందుకే గంటా మా పార్టీలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జోక్ చేస్తున్నారు. 

టీడీపీ మీద వ్యతిరేకత పెరుగుతుందని గంటా భావిస్తున్నారట. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే ఆలోచనతో భీమిలి నియోజకవర్గం వదిలి విజయనగరం జిల్లాకు తన మకాంను మార్చే ఆలోచన చేస్తున్నారు. అదే ఇప్పుడు హాట్ టాపికైంది. భూ కుంభకోణాలు ఆయన మెడకు చుట్టుకోవడంతో టీడీపీ నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారట. లేకపోతే ఈపాటికి మరో పార్టీలో చేరే వారంటున్నారు. వియ్యకుండు నారాయణ చాలా వరకు ఆయన్ను కాపాడుతున్నారు. లేకపోతే ఎప్పుడో గంటా పోస్టకు వేటు పడేదంటున్నారు. మరోవైపు గంటా సుపుత్రుడు విషయంలోను అనేక ఆరోపణలు వస్తున్నాయి. హీరోయిన్లతో ఆయన చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారనే ప్రచారం వచ్చిన సంగతి తెలిసిందే. గంటాకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని వైకాపా అంటోోంది. ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. 

Related Posts