YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

అర్ధరాత్రి టమాటల చోరీ

అర్ధరాత్రి టమాటల చోరీ

మెదక్, జూలై 24, 
టామాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. దొంగలు వీటిపై కన్నేశారు. తమకు అందినకాడికి దోచుకెళ్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరేమో వాటిని తీసుకెళ్లి కడుపునిండా తినేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో టమాటాల దొంగతనం జరిగింది. ఓ కూరగాయల మార్కెట్ లో ఉన్న టమాటా ట్రేలను ఎత్తుకెళ్లేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి పకడ్బందీగా ప్లాన్ వేశాడు. హెల్మెట్టుతో పాటు జాకెట్ కూడా వేసుకొని వచ్చి రూ.6,500 విలువ చేసే మూడు టమాటాల ట్రేలను ఎత్తుకెళ్లిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కమిషన్ ఏజెంట్ దుకాణంలో ఈ చోరీ జరగగా.. బాధిత ఏజెంట్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై జులై 15వ తేదీన టమాటా లోడ్ తో వెలుతున్న లారీ ఓ కారును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్, క్లీనర్ చాక చక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరగా మావల చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఈ టమాటా లారీ బోల్తా కొట్టడంతో అందులోని టమాటాలను చూసిన స్ధానికులు టమాటాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. యజమాని, లారీ డ్రైవర్, క్లీనర్ అప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు సహాయం కోరారు. దాంతో హుటాహటీన అక్కడకు చేరుకున్న పోలీసులు జనాలను చెదరగొట్టారు. టమాటాల కోసం తండోపతండాలుగా తరలి వచ్చిన జనం పోలీసులను చూసి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లి పోయారు. టమాటాలు ఎత్తుకెళ్లకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. హైవే పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక పైలట్ వాహనంతో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Posts