గుడివాడ
గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. వివరాల్లోనికి వెళితే ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ చెరువులా మారిపోయింది. దీంతో ప్రయాణికులు బస్టాండ్ లోనికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు, ఏలూరు వెళ్లే ప్రయాణికులు వేచి ఉండే ప్లాట్ఫారం బస్టాండ్ గేటు పక్కనే ఉండగా, విజయవాడ, మచిలీపట్నం, కైకలూరు వెళ్లే ప్రయాణికులు ప్లాట్ఫారం మీదకు వెళ్లాలంటే నీటిలో నుండి నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. దీంతో ప్రయాణికులు బస్టాండ్ లోకి వెళ్లలేక రోడ్డుపైన వేచి ఉండటం కనిపించింది. దశాబ్ద కాలంగా బస్టాండ్ వర్షాకాలం నీట మునగటం సర్వసాధారణం అయిపోయింది. ఇటీవలే బస్టాండ్ లోపల నూతన గ్యారేజీ నిర్మాణం చేపట్టగా త్వరలో బస్టాండ్ ను కూడా నూతన నిర్మాణం జరపనున్నట్లు గతంలో డిపో మేనేజర్ రాజేష్ తెలిపారు. ఏదేమైనా వర్షాకాలం ప్రయాణికులు బస్టాండ్ లోకి వెళ్లడానికి తీవ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.