YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పసుపు పండుగకు అంతా సిద్ధం

పసుపు పండుగకు అంతా సిద్ధం

పసుపు తోరణాలతో విజయవాడ స్వాగతం పలుకుతోంది. ఏ రోడ్డు చూసినా  ఏ సెంటర్ చూసినా టీడీపీ పండుగ వాతావరణమే. తెలుగుదేశం మహానాడు పురష్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు నగరమంతా పసుపు మయం చేసారు. మూడు రోజులు నిర్వహించే ఈ వేడుక కోసం పార్టీ అధిస్టానం పెద్దఎత్తున ఎర్పాట్లు చేస్తుంటే, వేలాదిగా తెలుగు తమ్ముల్లు ఇందులో పాల్గోనేందుకు బెజవాడకు బయలుదేరారు.విజయవాడ సిద్ధార్దా ఇంజనీరింగ్ కాలేజి టీడీపీ మహానాడుకు ముస్తాభైంది. మూడు రోజులు పాటు జరిగే మహానాడు కోసం సర్వంసిద్దమైంది. మరికొన్ని గంటలలోనే తెలుగుదేశం పార్టీ మహాసంబరానికి తెరలేవనుంది. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహావేదికపై నుంచి మహానాడును ప్రారంభించనున్నారు. ఇది 36వ మహానాడైతే, కృష్ణా జిల్లాలో మూడవ మహానాడు. అయితే గతంలో జరిగిన మహానాడులకన్నా ఇది భిన్నమైనదిగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన నూతన రాజధానిలో జరుగుతున్న మహానాడైతే,  ఎన్నికల ముందు జరుగుతున్న వేడుక కావడంతో అత్యంత కీలకమైనదిగా పార్టీ అధిస్టానం భావిస్తోంది.ఈ మహానాడు ద్వారా తెలుగుదేశం శ్రేణులకు దశ దిశ చేయనున్నారు.  అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ పట్ల చూపిస్తున్న వివక్షత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాలికొదిలేయడం వంటి అంశాలను మరోసారి మహానాడు వేదిక ద్వారా దేశ ప్రజలకు వినిపించాలని పార్టీ నిర్ణయించింది. ఇలాంటి కీలకమైన అంశాలతో పాటుగా 36 అఁశాలపై చర్చించి సభ తీర్మానం చేయనుంది.మహానాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నారు. అంతేకాకుండా దేశ విదేశాలలో ఉన్న తెలుగుదేశం అభిమానులు కొందరు ఇప్పటికే నగరానికి చేరుకోగా  మరికొందరు వేర్వేరు మార్గాల ద్వారా మహానాడుకు రానున్నారు. అయితే మహానాడుకు వచ్చేవారికి కోసం పోలీసులు వేర్వేరు రూట్లు ఫైనల్ చేసారు. అయితే మహానాడుకు వచ్చే వెహికల్స్ తో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు సిటీలోకి భారీ వాహానాలు రాకుండా మళ్లించారు. 

విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లవలసిన వాహానాలు హానుమాన్ జంక్షన్ వద్ద రూట్ మళ్లించారు. ఈ వెహికల్స్ గుడివాడ, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు మీదుగా తిరిగి జాతీయ రహాదారికి చేరుకుంటాయి. అదేవిధంగా హైదరబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే వాహానాలను నార్కెట్ పల్లి నుంచి మిర్యాలగూడ, అద్దంకి, పిడుగురాళ్ల మీదుగా రూట్ మళ్లించారు. హైదరబాద్ నుండి ఏలూరు వైపు వెళ్లాల్సిన వాహానాలను ఇబ్రహీంపట్నం వద్ద రూట్ డైవర్షన్ ఇచ్చారు. ఈ వెహికల్స్ మైలవరం, నూజివీడు, హానుమాన్ జంక్షన్ మీదుగా వెళ్తాయి. అలా అన్నీ రూట్లను ఈ మూడు రోజులు డైవర్షన్ ఇచ్చినట్లు పోలీసు కమీషనర్ గౌతంసవాంగ్ తెలిపారు. మహానాడు వలన సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. మహానాడు వేదికలలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసింగ్ ఏర్పాటు చేసామన్నారు. దాదాపు  రెండు వేల మంది బందోబస్తు నిర్వహిస్తారని, మూడంచెల విధానంలో భద్రత ఉంటుందని ఆయన తెలిపారు...

మహానాడు వలన సిటీలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా రూటింగ్ ప్లాన్ చేసారు. ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాహానాలు ఎనికేపాడు వద్ద కొత్త ఆటోనగర్ రోడ్డులోకి డైవర్ట అవుతారు. అక్కడ నుంచి నేరుగా మహానాడు ప్రాంగాణానికి సమీపంలోకి చేరుకుంటారు.  అలా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలంతా మహానాడు దక్షిణద్వారా లోనికి ప్రవేశిస్తారు. వీరి కోసం దక్షిణవైపున 20 రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటుగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారంతా మహానాడు ఉత్తర ద్వారా లోనికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేసారు. వీరు బెంజిసర్కిల్ నుంచి బందర్ రోడ్డు మీద పడమట, కానూరు మీదుగా సిద్దార్ధా ఇంజనీరింగ్ కాలేజి గేట్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్లలలో పేరు నమోదు చేసుకుని ఉత్తరముఖద్వారా వీరు మహానాడు వేదికకు చేరుకుంటారు.  ఇదే రూట్ లో పార్టీ జాతీయ అద్యక్షుడు, సిఎం చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. ముందుగా వేదిక పక్కనే ఏర్పాటు చేసిన పోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంబిస్తారు. అక్కడ నుంచి మహానాడు వేదిక మీదుకు చేరుకుంటారు. ఇక పార్టీకి సంబంధించిన కీలక నాయకులు, మంత్రులు, విఐపిలు వెళ్లెందుకు మాత్రం మరోరూట్ సిద్దం చేసారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పంటకాల్వ రోడ్డులో ప్రయాణించి వేదిక వెనుకభాగం ద్వారా లోనికి వెళ్తారు. విఐపిల వెహికల్స్ వేదిక దగ్గరకు వెళ్లెవిధంగా ఈ రూట్ ఉంటుంది. మహానాడుకు రోజుకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు వస్తారని అంచనా. అందుకు తగినట్లుగానే వెహికల్స్ ఉంటాయి.    వారు వేసుకొచ్చే వాహానాలన్నీ సభాస్ధల వరకు వచ్చేవిధంగా రూటింగ్ ఇచ్చిన పోలీసులు వాటి పార్కింగ్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సిద్దార్దా ఇంజనీరింగ్ కాలేజికి మూడు వైపులా సుమారు 30 ఎకరాలలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసారు. నాలుగు ప్లేసులను గుర్తించి వాటిలో సుమారు మూడు వేలు వెహికల్స్ ఉంచేలా ప్లేస్ రెఢీ చేసారు. ఇక మహానాడు వేదికకు అతి సమీపంలోనే దాదాపు వెయ్యి విఐపి వాహానాలు పట్టేలా ఒక పార్కింగ్ సిద్దం చేశారు.

తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంబరంగా చేసుకునే ఈ మహానాడు వేదికలో సంప్రదాయ వంటకాలకు కూడా పెద్దపీఠ వేస్తారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల నుంచి ఈ మహానాడుకు తరలివస్తారు. వీరికి వేర్వేరు ప్రాంతాల రుచులను ఈ మహానాడు వేదిక అందిస్తోంది. అయితే ఈమహానాడుకు సంబంధించి భోజన ఏర్పాట్లన్నీ మంత్రి దేవినేని ఉమా కన్వీనర్ గా ప్రత్యేక కమిటీని వేశారు. సుమారు 80 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఈ  బోజనాల ఏర్పాట్లు పర్వవేక్షిస్తున్నారు. 18 రకములు వంటకాలతో భోజనం సిద్దం చేస్తుండగా... బ్రేక్ పాస్ట్, స్నాక్స్ రకములతో  కలిపి సుమారు 30 రకములు రుచులు అందించేలా ప్లాన్ చేస్తున్నారు. భోజనాలతో పాటు స్వీట్లు కూడా వివిధ ప్రాంతాలకు చెందినవి అందిస్తున్నారు. తాపేశ్వరం కాజా, బందరు లడ్డు, ఆత్రేయపురం పూత రేకులు,  రోజుకు ముప్పై నుంచి నలభై వేల మంది భోజన చేస్తారు. అందుకు తగినట్లుగానే ట్రిపుకు ఏడు వేల మంది బోజనం చేసేలా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును చాలా  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనేక కీలకమైన తీర్మానాలతో పాటుగా అన్న ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతలు మరింత పెంచేలా ఈ మహానాడు నిర్వహిస్తున్నారు

Related Posts