కేరళలో ఉన్న నిపా వైరస్ హైదరాబాద్‌కు సోకేసినట్టుంది. నిమ్స్, ఫీవర్ ఆస్పత్రుల్లో నిపా అనుమానిత కేసులు వెలుగు చూశాయి. గురువారం ఇద్దరు వ్యక్తులకు నిపా వైరస్ సోకినట్టు అనుమానించామని, వారి రక్తనమూనాలను పుణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపామని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. నిపా సోకితే మాటలు తడబడతాయని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మెదడు వాపు సమస్య వస్తుందంటున్నారు. వ్యాధిగ్రస్తులు దగ్గినా, తుమ్మినా అది వ్యాపిస్తుందని, వారి మూత్రం, చెమట, తెమడ ద్వారా కూడా వైరస్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. నిపాకు ప్రత్యేకించి వైద్యమేమీ లేదన్నారు. కేరళలో ఇప్పటికే ఈ వైరస్ దాడికి 12 మంది చనిపోయారని, మరో 22 మందికి గుర్తించారని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు