YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బాక్సాఫీసు ముందుకు 4 సినిమాలు

బాక్సాఫీసు ముందుకు 4 సినిమాలు

హైదరాబాద్, జూలై 25, 
ప్రతీ శుక్రవారం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదల అవుతూనే ఉంటాయి. గత రెండు వారాలుగా చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదల అవుతూ వచ్చాయి. అయితే జులై చివరి వారంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా విడుదల కావడంతో ఈ వారం ధియేటర్లలోకి వచ్చే సినిమాల సంఖ్య తగ్గింది. మరోవైపు ఓటీటీలో కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ వారంలో థియేటర్లు, ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్ వేసేయండి.
 విడుదల అయ్యే సినిమాలు..
‘బ్రో’..
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా ‘బ్రో’. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన మూవీ ‘వినోదయ సిత్తం’కు ఇది తెలుగు రిమేక్. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, సముద్రఖని ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘స్లమ్ డాగ్ హస్బెండ్’
నటుడు సంజయ్ రావు హీరోగా ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించిన సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఈ సినిమాకు ఏ ఆర్ శ్రీధర్ దర్శకుడు. బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. జాతకంలో దోషం ఉన్న ఓ యువకుడు కుక్కను పెళ్లి చేసుకోవడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే కథ. ఈ మూవీ జులై 29 న విడుదల కానుంది.  
రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, అలియా భట్ కలిసి నటించిన మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'.  ఈ సినిమాను కరణ్ జోహార్ తెరకెక్కించారు. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీను కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 28 న ఈ సినిమా విడుదల కానుంది.

Related Posts